అన్వేషించండి

Dil Raju: సెలబ్రిటీలు రారమ్మా.. ఎందుకు వస్తారు ? రాకేష్ వర్రే కామెంట్స్ పై స్పందించిన నిర్మాత దిల్ రాజు 

'సెలబ్రిటీలు రారమ్మా.. ఎందుకు వస్తారు ? ' రాకేష్ వర్రే కామెంట్స్ పై 'క' మూవీ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు స్పందించారు.

చిన్న సినిమాలకు ఇండస్ట్రీలో తలెత్తే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇక బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడితే పడే కష్టాలు చెప్పనవసరం లేదు. రీసెంట్ గా 'జితేందర్ రెడ్డి' మూవీ ఈవెంట్లో హీరో రాకేష్ వర్రే తమలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాలు చేసే హీరోల ఈవెంట్లకి సెలబ్రిటీలను తీసుకురావడం చాలా కష్టమైన విషయం అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ సెలబ్రిటీలు ఎందుకు వస్తారు? అని తిరిగి ప్రశ్నించారు. 

'బాహుబలి' మూవీతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రే 'ఎవరికీ చెప్పొద్దు' లాంటి విభిన్నమైన సినిమాలతో టాలీవుడ్ లో హీరోగా ప్రేక్షకులను అలరించాడు. 'పేక మేడలు' మూవీతో నిర్మాతగా మారిన ఆయన తాజాగా 'జితేందర్ రెడ్డి' అనే మూవీతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. ఉమ్మడి జగిత్యాల జిల్లాకు చెందిన ఒకప్పటి ఏబీవీపీ దివంగత నేత జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. రీసెంట్ గా ఈ మూవీ ప్రెస్ మీట్ లో సెలబ్రిటీలు ఎవరూ రావట్లేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Read Also : OTT Friday Movie Release: ఓటీటీల్లో ఈ రోజు స్ట్రీమింగ్‌కి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు... అస్సలు మిస్ అవ్వకండి

రాకేష్ వర్రే మాట్లాడుతూ "సెలబ్రిటీలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీ ఉంటేనే అది ఈవెంటా? ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాకు స్టేజ్ మొత్తం సెలబ్రిటీలే ఉన్నారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే.. సెలబ్రిటీలు కేవలం సపోర్ట్ చేస్తారు. సినిమాను జనాల వరకు తీసుకువెళ్లరు. కాబట్టి ఫిలిం మేకర్స్, నటీనటులు అందరికీ చెప్పేదొక్కటే.. మార్కెటింగ్ పై దృష్టి పెట్టండి. ఇప్పుడు అందరి మైండ్ సెట్ విచిత్రంగా మారిపోయింది. అంటే సెలబ్రిటీ ఉంటేనే అది ఈవెంట్, జనాల్లోకి వెళ్తుంది... అసలు ఈ మైండ్ సెట్ ఏంటి? అసలు నిజంగా ఒక సెలబ్రిటీని తీసుకురావాలంటే ఎంత కష్టమో తెలుసా మీకు? దానికంటే ఆ టైంలో ఒక సినిమాను చేయగలము. సెలబ్రిటీలు పిలిచినా రారు సార్... వాళ్లకు ఇష్టమైతేనే సినిమా ఈవెంట్స్ కి వస్తారు... వాళ్లకి ఫ్రెండ్స్ అయితోనో, లేదా మరేవిధంగా అయినా దగ్గర అయితేనో వస్తారు. ట్రై చేస్తూనే ఉన్నాము.. కానీ ఎవ్వరూ రాలేదు" అంటూ ఎమోషనల్ అయ్యారు. 

అయితే తాజాగా కిరణ్ అబ్బవరం 'క' మూవీ సక్సెస్ మీట్ లో దిల్ రాజు రాకేష్ వర్రే కామెంట్స్ పై స్పందించారు. ఆయన డైరెక్ట్ గా రాకేష్ పేరును ప్రస్తావిస్తూ 'నిన్న రాకేష్ ప్రెస్ మీట్ లో సెలబ్రెటీలు రావడం లేదని అంటున్నాడు... రారమ్మా.. ఎందుకు వస్తారు? ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిజీ వాళ్లది. వాళ్ల టైం మీ టైంతో సెట్ అయితే వస్తారు. మీడియాకు ఏంటంటే ఎవరైనా సెలబ్రిటీలు వస్తేనే వాళ్లకు క్లిప్స్ వస్తాయి. మన బాధ మనది, వాళ్ల బాధ వాళ్లది... అయితే సెలబ్రిటీ వచ్చారా లేదా అన్నది పాయింట్ కాదు... నువ్వు నీ సినిమాను ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకెళ్లావు అనేదే పాయింట్ ఇక్కడ... ఎలాగైనా సరే కంటెంట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాలి. అంతేగాని అంచనాలు పెట్టుకుని సినిమాలు చేయొద్దు. అప్ కమింగ్ నటీనటులు అందరికీ ఇదే నా సజెషన్" అంటూ చెప్పుకొచ్చారు. కాగా 'జితేందర్ రెడ్డి' మూవీ నవంబర్ 8న థియేటర్లోకి వచ్చింది.

Also Read: హీరోయిన్ లేకుండానే తెరపైకి రాబోతున్న "మ్యాడ్ స్క్వేర్".. కానీ టిల్లు గానీ పిల్లది మాత్రం స్పెషల్ రోల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget