అన్వేషించండి

NTRNeel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్, షూటింగ్ ఎప్పటి నుంచి అంటే?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ గురించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ లేకుండానే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

NTRNeel Shoot May Start From December: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘దేవర‘ రీసెంట్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా,  సైఫ్ అలీ ఖాన్ నెగెటివ్ పాత్ర పోషించారు. ప్రస్తుతం ‘వార్ 2‘ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీలో చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది.  

ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్

‘దేవర‘ షూటింగ్ తర్వాత ఎన్టీఆర్  బాలీవుడ్ మూవీ ‘వార్ 2‘లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో కొనసాగుతోంది. జనవరి నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ మూవీ షూట్ లో జాయిన్ కానున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే నెలలో హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్, జనవరిలో ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ కొనసాగనుంది.   

Also Read: హీరోయిన్ లేకుండానే తెరపైకి రాబోతున్న "మ్యాడ్ స్క్వేర్".. కానీ టిల్లు గానీ పిల్లది మాత్రం స్పెషల్ రోల్

ఫిబ్రవరిలో ఎన్టీఆర్ జాయిన్..

ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్‌ లాంచింగ్‌ రోజే మూవీ రిలీజ్‌ డేట్ ప్రకటించి సర్‌ప్రైజ్‌ చేశారు ప్రశాంత్ నీల్. సినిమా ప్రారంభం రోజున రిలీజ్‌ చేసిన పోస్టర్‌ అందరిలో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాకు సంబంధించి ‘డ్రాగన్‘ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1969 రోజుల్లో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్‌కి దగ్గరగా ఉండటంతో ఓపియం స్మగ్లింగ్ కి అడ్డాగా ఉండేది. ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. ఈ సంఘటనలను ఆధారం చేసుకుని ప్రశాంత్‌ నీల్‌ తనదైన స్టైల్లో కథను రాసుకున్నారట. చైనా డ్రగ్స్‌ మాఫీయా కోల్‌కాత్తాలో యాక్టివ్‌గా ఉండటం.. ఈ కథలో చైనా ప్రమేయమే ప్రధానంగా ఉండటంతో ఈ సినిమాకు 'డ్రాగన్‌' అనే టైటిల్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘KGF‘ టెక్నికల్ టీమ్ పని చేయనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ హైవోల్టేజ్ యాక్షన్‌ను నిర్మిస్తోంది. ఈ చిత్రం జనవరి 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సైలెంట్ గా NTR31 మూవీ పూజా కార్యక్రమాలు

ఇక ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గా జరిగాయి. సైలెంట్ గా జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా.. ప్రశాంత్ నీల్ సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సినిమాలో  'సప్త సాగరాలు దాటి' మూవీ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫీమేల్ లీడ్ కు ఓకే అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

Read Also: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ - అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల- ప్రవచనకర్త చాగంటికి కీలక బాధ్యతలు
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల- ప్రవచనకర్త చాగంటికి కీలక బాధ్యతలు
Seaplane In Andhra Pradesh: మోడల్‌ సీప్లేన్‌ పర్యాటకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు- ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలానికి ప్రయాణం
మోడల్‌ సీప్లేన్‌ పర్యాటకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు- ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలానికి ప్రయాణం
Pawan Kalyan: పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా - అసలు విషయం చెప్పేసిన నిర్మాత!
పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా - అసలు విషయం చెప్పేసిన నిర్మాత!
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల- ప్రవచనకర్త చాగంటికి కీలక బాధ్యతలు
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల- ప్రవచనకర్త చాగంటికి కీలక బాధ్యతలు
Seaplane In Andhra Pradesh: మోడల్‌ సీప్లేన్‌ పర్యాటకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు- ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలానికి ప్రయాణం
మోడల్‌ సీప్లేన్‌ పర్యాటకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు- ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలానికి ప్రయాణం
Pawan Kalyan: పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా - అసలు విషయం చెప్పేసిన నిర్మాత!
పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా - అసలు విషయం చెప్పేసిన నిర్మాత!
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
TG TET 2024: తెలంగాణ టెట్‌లో ఏ పేపర్‌కు ఎవరు అర్హులు? పరీక్షఎలా ఉంటుంది?
తెలంగాణ టెట్‌లో ఏ పేపర్‌కు ఎవరు అర్హులు? పరీక్షఎలా ఉంటుంది?
Nirmal District News: నిర్మల్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి- మహారాష్ట్ర దాటిందనుకుంటే కుంటాలలో ప్రత్యక్షం
నిర్మల్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి- మహారాష్ట్ర దాటిందనుకుంటే కుంటాలలో ప్రత్యక్షం  
Embed widget