Viswaksen Comments: నవదీప్ నటిస్తే రొమాన్స్.. ప్రొడ్యూస్ చేస్తే వయొలెన్స్: విశ్వక్ సేన్
Viswaksen: హీరో విశ్వక్ సేన్ నవదీప్ పై ఫన్నీ కామెంట్స్ చేశారు. నవదీప్ నటిస్తే రొమాన్స్ అని, ప్రొడ్యూస్ చేస్తే వైలెన్స్ అని అన్నారు. 'యేవమ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ కామెంట్స్ చేశారు విశ్వక్.
Viswaksen Comments On Actor Navdeep & Chandhini Chowdhury: తెలుగమ్మాయి చాందినీ చౌదరి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమా 'యేవమ్'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈసినిమా.. జూన్ 14న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది సినిమా టీమ్. దాంట్లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నవదీప్ గురించి చాలా విషయాలు మాట్లాడారు. ఫన్నీ కామెంట్స్ చేశారు విశ్వక్.
అన్నని అలా అర్థం చేసుకోవాలి..
'యేవమ్' ఈవెంట్ లో విశ్వక్ సేన్ స్పీచ్ చాలా ఫన్నీగా సాగింది. ఇటు నవదీప్, అటు చాందినీ చౌదరిని ఆడుకున్నారు విశ్వక్. "ఇండియన్ సినిమా బ్యూటీ ఏంటంటే ప్రపంచంలోనే చాలాపెద్ద సినిమా మనది. ఒకవైపు కల్కీ ట్రైలర్ చూసి, వర్షంలో ఇక్కడికి వచ్చారు. ఏ బేధభావాలు ఉండవు మీకు. అన్ని సినిమాలు ఇదే లెవెల్ లో ఎంకరేజ్ చేస్తారు. మీడియా వాళ్లందరికీ చాలా థ్యాంక్స్. నవదీప్ అన్నగురించి చెప్పాలంటే.. నవదీప్ అన్న సినిమాల్లో యాక్టింగ్ చేస్తే రొమాన్స్ ఎక్కువ, ప్రొడ్యూస్ చేస్తే వయొలెన్స్ ఎక్కువ అని అర్థం అయ్యింది నాకు. ఆల్ ది బెస్ట్ ఫర్ రిలీజ్. సీ స్పేస్ అనే కాన్సెప్ట్ తో వచ్చినప్పుడే చాలా మంచి డెసిషన్ అని అనుకున్నా. చాందినీ ఇందాక గెస్ట్ అంటే కోపం వచ్చింది. కానీ, నేను ఒక ఫ్రెండ్ లాగా వచ్చాను. చాలా సినిమాలు పనిచేశాను. అన్ని సినిమాల్లో పనిచేస్తారు మర్చిపోతారు. రిలీజ్ అయిన తర్వాత చాలామంది దగ్గర నంబర్లు కూడా ఉండవు. చాలా తక్కువ మంది ఉంటారు నేను రెస్పెక్ట్ చేసేవాళ్లలో. చాందినీ అంటే చాలా రెస్పెక్ట్ నాకు. నన్ను ఎవ్వరూ టెన్షన్ పెట్టక్కర్లేదు. నన్ను నేనే టెన్షన్ పెట్టుకుంటా బ్యాచ్ అది. ఏమి ఉండదు అక్కడ కానీ, టెన్షన్ పడిపోతుంటది. అట్టాంటి చాందినీ స్పీచ్ ఇస్తుంటే అసలు ఆశ్చర్యం కలిగింది. ఎవరి ట్రైనింగో తెలుసు కదా. భయం పోయింది. అది చాలు మాకు. ఆల్ ది బెస్ట్ ఫర్ మూవీ. అని అన్నారు విశ్వక్. ఇక ఈ సందర్భంగా సినిమా టీమ్ ని విష్ చేశారు ఆయన. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను" అంటూ స్పీచ్ ముగించారు. ఇక విశ్వక్ ఎప్పుడూ చాలా ఫన్నీగా ఉంటారు. అలా ఈ ఈవెంట్ లో ఆయన స్పీచ్ చాలా ఫన్నీగా అనిపించింది అందరికీ.
చాందిని చౌదరి పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమా ‘యేవమ్’ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వశిష్ట సింహా, భరత్ రాజ్, ఆషు రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవదీప్, పవన్ గోపరాజు నిర్మించారు. ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయం అయిన చాందినీ చౌదరి ఇప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె 'మ్యూజిక్ షాప్ మూర్తి', 'సంతాన ప్రాప్తిరస్తు' వంటి సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తోంది.