Viraaji Teaser: ‘విరాజి’ టీజర్ - భయపెడుతోన్న వరుణ్ సందేశ్, మునుపెన్నడూ చూడని లుక్‌లో!
Viraaji Movie Teaser: వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ చిత్రమే ‘విరాజి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయ్యింది. ఇందులో హీరో మునుపెన్నడూ కనిపించని లుక్‌తో ఆశ్చర్యపరిచాడు.
![Viraaji Teaser: ‘విరాజి’ టీజర్ - భయపెడుతోన్న వరుణ్ సందేశ్, మునుపెన్నడూ చూడని లుక్‌లో! Varun Sandesh starrer Viraaji movie teaser is out now and hero shocks audience with a new look Viraaji Teaser: ‘విరాజి’ టీజర్ - భయపెడుతోన్న వరుణ్ సందేశ్, మునుపెన్నడూ చూడని లుక్‌లో!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/10/cfbb8faa5dbd82caf0ef4d63c47c8aa81720620934610802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Viraaji Movie Teaser Is Out Now: ఒకప్పుడు హారర్ కామెడీ చిత్రాలు ఫుల్ ట్రెండింగ్‌లో ఉండేవి. కానీ గత కొంతకాలంగా కామెడీ లేకుండా కేవలం హారర్ కథాంశాలతో వచ్చి ప్రేక్షకులను భయపెడుతున్న సినిమాలు ఎక్కువగా సక్సెస్‌ను సాధిస్తున్నాయి. అందుకే వరుణ్ సందేశ్ కూడా అదే సక్సెస్ ఫార్ములాను ఫాలో అవ్వడానికి సిద్ధమయ్యాడు. ఒకప్పుడు సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు సాధించిన వరుణ్.. తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత సినిమాల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అలా ‘విరాజి’ అనే హారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ‘విరాజి’ టీజర్ విడుదలయ్యింది.
చాలా జాగ్రత్త..
తాళం వేసిన రూమ్, పాతబడిన బంగ్లాను చూపిస్తూ ‘విరాజి’ టీజర్ మొదలవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘‘మనం చాలా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని వరుణ్ సందేశ్ వాయిస్‌తో డైలాగ్ వినిపిస్తుంది. ఆ బంగ్లాలో ఇరుక్కుపోయిన కొందరు మనుషులు, వారితో పాటు వరుణ్ సందేశ్.. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. అందరినీ సైలెంట్‌గా ఉండమని చెప్పి.. ‘‘నేను ఒక పని చేయాలి’’ అని చెప్తాడు వరుణ్. అప్పుడు కొన్ని భయంకరమైన నవ్వులు వినిపిస్తాయి. గోడ మీద ఏదో రాసుంటుంది. లైట్స్ ఆన్, ఆఫ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ చూసి అక్కడ ఉన్నవారికి ఇంకా భయమేస్తుంది.
కొత్త లుక్..
‘విరాజి’ టీజర్ అంతా ఒక ఎత్తు అయితే.. చివర్లో వరుణ్ సందేశ్ ఇంట్రడక్షన్ మరో ఎత్తు. ఇప్పటివరకు వరుణ్ సందేశ్‌ను ఆ అవతారంలో మునుపెన్నడూ చూడలేదు. అలాంటి ఒక డిఫరెంట్ లుక్‌తో మోడర్న్ అవతారంలో ఉన్న భూత వైద్యుడిలాగా కనిపించాడు ఈ హీరో. ‘విరాజి’ టీజర్ చూస్తుంటే ఇదొక హారర్ మూవీ అని క్లారిటీ వస్తుంది కానీ అసలు దీని కథ ఏంటి అనే విషయం మాత్రం ఇందులో అసలు రివీల్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు అద్యంత్ హర్ష. చివరిగా ఈ మూవీ ఆగస్ట్ 2న విడుదల అవుతుందని ప్రకటిస్తూ టీజర్‌ను క్లోజ్ చేశారు. మొత్తానికి టీజర్‌తోనే ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేయగలిగారు మేకర్స్.
ఒకే లొకేషన్‌లో..
‘విరాజి’లో వరుణ్ సందేశ్‌తో పాటు రఘు కరుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ, అపర్ణ దేవి, కుషాలిని, ప్రసాద్ బెహరా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇక తాజాగా విడుదలయిన టీజర్ చూస్తుంటే సినిమా మొత్తం ఒక పాతబడిన బిల్డింగ్‌లోనే జరుగుతుందని అర్థమవుతోంది. అది తప్పా ఈ టీజర్‌లో ఇంకా ఏ లొకేషన్‌ను చూపించలేదు. ఎబ్బీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ‘విరాజి’ టీజర్‌లోని హారర్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేయడానికి ఉపయోగపడింది. ఎమ్3 మీడియా బ్యానర్‌పై మహేంద్రనాథ్ కొండ్లా.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను అలరిస్తున్న వరుణ్ సందేశ్.. ‘విరాజి’తో పూర్తిగా తన లుక్‌ను మార్చేసి ఆడియన్స్‌లో ఆసక్తిని క్రియేట్ చేశాడు.
Also Read: చావును ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం - ఉత్కంఠ పెంచుతున్న 'తంగలాన్' ట్రైలర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)