కారు పార్కింగ్‌లో ఆ రొమాన్స్ ఏంటీ వరుణ్ - కెమేరాకు దొరికిపోయారట!

‘హ్యాపీ డేస్’ మూవీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్.

ఆ తర్వాత ‘కొత్త బంగారు లోకం’ మూవీ కూడా వరుణ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

అయితే, ఆ తర్వాత అతడు నటించిన సినిమాలేవీ అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి.

వరుణ్ కొన్నాళ్లు శ్రద్ధాదాస్‌తో డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి.

ఆ తర్వాత ‘పడ్డాడండి ప్రేమలో మరి’ సినిమా వరుణ్‌కు లైఫ్ పార్టనర్‌ను ఇచ్చింది.

ఆ మూవీ హీరోయిన్ వితికా షెరూను 2015లో పెళ్లి చేసుకున్నాడు.

ఈ జంట ‘బిగ్ బాస్’ సీజన్ 3లో కూడా పాల్గొన్నారు.

చాలా రోజుల తర్వాత వరుణ్ సందేశ్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అతడు నటించిన ‘నింద’ మూవీపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది.

తాజాగా వరుణ్.. తన భార్యతో కారు పార్కింగ్‌లో రొమాంటిక్‌గా మాట్లాడటం కనిపించింది.

ఆ వీడియోను వితికానే షేర్ చేసింది.. ఇలా దొరికిపోయామంటూ క్యాప్షన్ ఇచ్చింది.