అన్వేషించండి

Kajal Aggarwal: పెళ్లైతే హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలి, ట్రెండ్ మారింది - 'సత్యభామ' ఇంటర్వ్యూలో కాజల్ కామెంట్స్

Kajal Aggarwal Interview: కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ ఫిల్మ్ 'సత్యభామ' శుక్రవారం విడుదలవుతోంది. ఈ మూవీ ఇంటర్వ్యూలో పెళ్లైన హీరోయిన్స్ కెరీర్ మీద ఆవిడ స్పందించారు.

''ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అదే విధంగా కథానాయికలకు కూడా! పెళ్లైన తర్వాత హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలి? అది విషయం నాకు అర్థం కాదు. ఇంతకు ముందు పెళ్లైన హీరోయిన్లకు అవకాశాలు తగ్గాయేమో! ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. పెళ్లైన హీరోయిన్లు గతంలో కంటే బిజీగా సినిమాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు వెళుతున్నారు'' అని కాజల్ అగర్వాల్ చెప్పారు. తన వరకు వ్యక్తిగత జీవితాన్ని, నటిగా సినిమా జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నానని, అది కష్టమైన పని అయినప్పటికీ... ఇష్టంతో చేస్తున్న పని కనుక ఇబ్బంది పడటం లేదన్నారు. ఈ ప్రయాణంలో తనకు కుటుంబం, ముఖ్యంగా భర్త నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారామె.

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'సత్యభామ' (Satyabhama Movie). ఆమెకు సరసన అమరేందర్ పాత్రలో నవీన్ చంద్ర నటించారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాస రావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించారు. 'మేజర్' దర్శకుడు శశికిరణ్ తిక్క  (Sashi Kiran Tikka) సమర్పకులుగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఈ నెల 7న (శుక్రవారం) సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కాజల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను క్వీన్ ఆఫ్ మాసెస్ అనడంతో పాటు సినిమా గురించి పలు విషయాలు చెప్పారు. ఆ వివరాలు ఆమె మాటల్లో...

  • నేను 'సత్యభామ' లాంటి ఎమోషనల్ యాక్షన్ సినిమా ఇప్పటి వరకు చేయలేదు. ఈ సినిమాలో నేను పోషించిన పాత్రను నా వ్యక్తిగత జీవితానికి రిలేట్ చేసుకోవచ్చు. నిజ జీవితంలో 'సత్యభామ'లా నేనూ సమాజంలో ఏదైనా జరిగితే స్పందిస్తా. రోడ్డు మీదకు వచ్చి ర్యాలీలు చేయకున్నా... జరిగిన ఘటన గురించి ఆలోచిస్తుంటా. ఆ ఆలోచనలు కొన్నాళ్లు నన్ను డిస్టర్బ్ చేస్తుంటాయి. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలపై నాకూ వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి.
  • 'సత్యభామ' లాంటి ఎమోషనల్ సినిమా నేను చేయడం తొలిసారి. ఈ సినిమాలో నేను యాక్షన్ కూడా చేశా. యాక్షన్ సీక్వెన్సులు, ఎమోషనల్ సీన్లు చేసేటప్పుడు ఇప్పటి వరకు కలుగని కొత్త అనుభూతి వచ్చింది. యాక్షన్ సహా సినిమాలో ప్రతిదీ సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.
  • తెలుగు చిత్రసీమలో ప్రముఖులు, ప్రేక్షకులు చాలా కాలం నన్ను 'చందమామ' అన్నారు. ఇప్పుడు 'సత్యభామ', 'క్వీన్ ఆఫ్ మాసెస్' అని పిలిచినా సంతోషిస్తా. ఆ రెండూ నాకు కావాలి. చందమామ అందమైన పేరు, సత్యభామ శక్తివంతమైన పేరు. ఆ రెండూ నాకు ఇష్టమే.

Also Read: 'మనమే' ఫస్ట్ రివ్యూ... ఒక్క బోర్ మూమెంట్ లేదు, పక్కా హిట్ - శర్వా సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?

  • నేను 'జిల్లా'లో పోలీసుగా కనిపించా. అయితే అది హీరోయిన్ రోల్. 'సత్యభామ'లో ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ ఫుల్ రోల్స్ చేశా. నాకు ఈ టైపు రోల్ చేయడం కొత్త. నా నటన కూడా కొత్తగా ఉంటుంది. యువతరం, బెట్టింగ్ అంశాలతో పాటు ఓ మతానికి సంబందించిన అంశాలు సినిమాలో ఉంటాయి. ట్రైలర్ కంటే మరిన్ని ట్విస్టులు సినిమాలో ఉంటాయి. ఇందులో యాక్షన్ సీక్వెన్సుల కోసం కష్టపడ్డా. నా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సహజంగా అవి డిజైన్ చేశారు.
  • 'మేజర్'తో పాటు శశికిరణ్ దర్శకత్వం వహించిన చిత్రాలు చూశా. ఆయన మంచి డైరెక్టర్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం లేదని అడిగా. స్క్రీన్ ప్లే రాస్తూ, చిత్ర సమర్పకులుగా ఉంటున్నానని చెప్పారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించా. సినిమా బాగా వచ్చేలా చూసుకున్నారు. సుమన్ చిక్కాలకు తొలి సినిమా అయినా ఎంతో కన్విక్షన్‌తో తీశారు. ఆయనతో చేయడం హ్యాపీ. మా నిర్మాతలు కొత్తవాళ్లైనా బేబిని చూసుకున్నట్లు సినిమా తీశారు. ఎంతో జాగ్రత్తగా సినిమా తీశారు. అవురమ్ ఆర్ట్స్ నా సొంత బ్యానర్ లాంటిది.
  • నా పాత్ర 'భారతీయుడు 3'లో ఉన్నప్పటికీ... సీక్వెల్ కోసం రిలీజ్ కోసం ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నా. అందులో నేను కొత్తగా డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తా. ఇప్పటి నుంచి మరిన్ని వైవిధ్యమైన సినిమాలు నటిగా మరింత పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నా. రెండు డిఫరెంట్ సినిమాలకు సంతకం చేశా. త్వరలో నిర్మాణ సంస్థలు ఆయా వివరాలు వెల్లడిస్తాయి.

Also Readపవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget