కాజల్ 50కు పైగా సినిమాలు చేశారు. అందులో తెలుగువీ ఉన్నాయి. వాటిలో టాప్ 7 ఫిలిమ్స్ ఏవి అంటే... చందమామ - తెలుగులో కాజల్ రెండో సినిమా. కృష్ణవంశీ ఆమెను చూపించిన తీరుకు ప్రేక్షకులు అయ్యారు ఫిదా! మగధీర - యువరాణి మిత్రవిందగా కాజల్ సందడి చేసిన సినిమా. పాటల్లో, సన్నివేశాల్లో ఆమె నటన సూపర్! నేనే రాజు నేనే మంత్రి - తెలుగు తెరకు కాజల్‌ను పరిచయం చేసిన తేజ, ఆమెలో నటిని కొత్తగా చూపించిన సినిమా బాద్షా - కాజల్ కామెడీ కూడా చేస్తుందని చెప్పిన సినిమా. అందులో ఆవిడ చెప్పే కథలు కేక ఆర్య 2 - ద్వేషించే వ్యక్తిని ప్రేమించే కథానాయిక క్యారెక్టర్ కాజక్‌కు మరోసారి రాదేమో!? డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ - రెండూ ప్రభాస్ సినిమాలే. రెండిటిలో ఆమె రోల్స్ వేర్వేరు. కానీ, మర్చిపోవడం కష్టం. జనతా గ్యారేజ్ - కాజల్ ఐటమ్ సాంగ్ చేసిన ఏకైక సినిమా. 'పక్కా లోకల్'లో డ్యాన్స్ చేసినట్టు వేరే పాటలో చేయలేదు. సత్యభామ - ఇప్పటివరకు కథానాయికగా తనను చూసిన ప్రేక్షకులకు యాక్షన్ అవతార్ చూపించడానికి సిద్ధమైన సినిమా. కాజల్ అగర్వాల్ (All Images Courtesy: kajalaggarwalofficial and her Instagram)