అన్వేషించండి

Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు

Inter Academic Calendar : తెలంగాణ ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్ విడుదల అయింది. జూన్ 15 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.

Inter Academic Calendar :  తెలంగాణ ఇంటర్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. జులై 1వ తేదీ నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభించనున్నట్లు బోర్డు ప్రకటించింది. జూన్ 15న రెండో సంవత్సరం క్లాసులు ప్రారంభంకానున్నట్లు తెలిపింది. 2022-23 విద్యాసంవత్సరంలో మొత్తం 221 పనిరోజులతో షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ఖరారు చేసింది. అక్టోబరు 2-9వ తేదీ వరకు దసరా సెలవులు, వచ్చే ఏడాది జనవరి 13-15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, ఫిబ్రవరి 6-13 మధ్య ప్రీ ఫైనల్స్‌ పరీక్షలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్‌, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు, ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు బోర్డు పేర్కొంది.

పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు

తెలంగాణలో నిర్వహించనున్న కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఏ డిగ్రీ పాసైన విద్యార్తులైనా ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన ఉపకులపతులతో (Vice Chancellor Of Universities In Telangana) ఉన్నత విద్యా మండలి సోమవారం భేటీ అయింది. వచ్చే విద్యా సంవత్సరంలో పీజీ కోర్సులలో మార్పులపై స్పందించారు.

ఈ ఏడాది సైతం ఓయూకే బాధ్యతలు 

ఈ ఏడాది నిర్వహించనున్న కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2022-23 ( Telangana CPGET 2022) నుంచి పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు ఏ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినా వారికి ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీలో అడ్మిషన్ పొందే అవకాశం కల్పించారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది సైతం కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టు నిర్వహణ బాధ్యలు ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. మే నెలాఖరుకల్లా టీఎస్ సీపీజీఈటీ 2022 (TS CPGET 2022 Notification) నోటిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు.

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జీరో అడ్మిషన్లు (Decision On Zero Admission Colleges) నమోదైన కాలేజీలు, కోర్సులను రద్దు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఓ కోర్సులో 15 మంది కంటే తక్కువ విద్యార్థులు అడ్మిషన్ పొందితే వారిని ఇతర కోర్సులకు ట్రాన్స్‌ఫర్ చేయడం లేదా వారిని డిస్టెన్స్‌ (Distance Education)లో చదివే అవకాశం కల్పించాలని వర్సిటీల వీసీలకు ఉన్నత విద్యా మండలి సూచించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court  : చంద్రబాబు  బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - ఏప్రిల్ 16న మళ్లీ విచారణ !
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - ఏప్రిల్ 16న మళ్లీ విచారణ !
Brothers As DGPs: దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

MS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.? | ABP DesamSRH Captain Pat Cummins IPL 2024 | కమిన్స్ రాకతోనైనా ఆరెంజ్ ఆర్మీ ఆకట్టుకుంటుందా.? | ABP DesamPinkvilla Screen And Style Awards: ముంబయిలో ఘనంగా జరిగిన అవార్డుల వేడుక, విభిన్న డ్రెస్సుల్లో తారలుRajamouli Mahesh Babu Movie: జపాన్ లో RRR స్క్రీనింగ్స్ సందర్భంగా మహేష్ మూవీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court  : చంద్రబాబు  బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - ఏప్రిల్ 16న మళ్లీ విచారణ !
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - ఏప్రిల్ 16న మళ్లీ విచారణ !
Brothers As DGPs: దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Home Loan: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Embed widget