Viral News: సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి కోట్లు సంపాదించాడు కానీ భార్య చేతిలో నలిగిపోతున్న ప్రసన్న - ఇలాంటి భార్యలుంటారా?
Wife: వివాహేతర బంధం పెట్టుకున్న ఓ భార్య వేధింపులపై ఓ భర్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. మరోసారి భార్యల క్రూర ప్రవర్తన అంశం చర్చనీయాంశమవుతోంది.

Wife harassing husband: ఇద్దరు భార్యభర్తలు. పదేళ్ల కిందట పెళ్లయింది. వారికి తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ భర్త సాఫ్ట్ వేర్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఓ కంపెనీని పెట్టి వందల కోట్ల విలువైన కంపెనీగా తీర్చిద్దారు. కానీ కుటుంబాన్ని కాపాడుకోవడంలో సక్సెస్ కాలేకపోయాడు. అతని భార్య ఓ వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకుంది. వారిద్దరూ ఏకాంతంగా గడిపారన్నదానికి సాక్ష్యాలను కూడా ఈ భర్త కనిపెట్టాడు.కానీ ఆ భార్య అతనిపై గృహహింస కేసు పెట్టింది. దాంతో అతను పోలీసులకు చిక్కకుండా పారిపోవాల్సి వచ్చింది. తన స్టోరీని ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని తన బాధ.. అంతా వెళ్లబోసుకున్నాడు.
ఈ బాధ అంతా చెప్పుకుంది.. చెన్నైకు చెందిన ప్రసన్న అనే వ్యక్తి. అతని భార్య పేరు దివ్య. విడాకులు ఇవ్వాలంటే కోట్లు డిమాండ్ చేస్తోందని.. ప్రసన్న అంటున్నారు. అంతే కాదు తాను కోర్టులకు హాజరు కాకుండా పాస్ పోర్టు కూడా లాకర్ లో పెట్టిందని ఇవ్వడం లేదని అంటున్నారు. భార్య తనను ఎన్ని విధాలుగా వేధిస్తుందో ఆయన ట్వీట్ పెట్టారు.
My name is Prasanna, who previously founded Rippling (worth $10B); I'm going through a divorce. I'm now on the run from the Chennai police hiding outside of Tamil Nadu. This is my story.
— Prasanna S (@myprasanna) March 23, 2025
అనూప్ అనే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకుందన్న ఆధారాలు కూడా ప్రసన్న ట్వీట్ లో పెట్టారు.
Anoop's wife sent me the message my wife had sent Anoop and hotel bookings she made for him. pic.twitter.com/0gs1mMBc6d
— Prasanna S (@myprasanna) March 23, 2025
దొరికిపోయిన తర్వాత రివర్స్ లో తన భార్య రేప్ కేసు పెట్టి.. సింగపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. అయితే ఈ ఆరోపణలు బేస్ లెస్ అని వారు తేల్చారన్నారు. ప్రసన్న కథచాలా పెద్దది. ఆసక్తికరంగా ఉంది. సోషల్మీడియాలో పలువురు ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు .
Husband Prasanna Sankaranarayanan is an Indian Citizen.
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) March 24, 2025
Wife Dhivya Shashidar is an American citizen.
But still @chennaipolice_ is after the Husband, Why?
Reason1: Because in India Gender defines your legal rights and not the citizenship.
Reason2: Because Husband is an ATM.… pic.twitter.com/HQtB40yg6k
ప్రసన్నకు ఇప్పుడు సాయం చేయాలని చాలా మంది పోస్టులు పెడుతున్నారు.
MAKE Prasanna (Founder of Rippling) STORY VIRAL. He Needs Help. His wife, Dhivya Sashidhar cheated on him & then filed false cases against him. Despite Case being in Court, the Chennai Police is harassing him, his Family & his friend Gokul. CREATE A TWITTER STORM TO HELP HIM pic.twitter.com/SA1t9VqW1Z
— Rosy (@rose_k01) March 23, 2025
ఈ అంశంలో ప్రసన్న భార్య ఇంకా స్పందించలేదు. ఆమె వెర్షన్ ఏమిటో ఇంకా సోషల్ మీడియాోల చెప్పకపోవడంతో ప్రసన్నకు మద్దతు లభిస్తోంది.





















