(Source: ECI/ABP News/ABP Majha)
Rayachoti Crime : కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!
Rayachoti Crime : అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఆస్తి గొడవలతో కోడలను నరికి చంపేసిందో అత్త. ఆ తర్వాత కోడలి తల పట్టుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది.
Rayachoti Crime : అన్నమయ్య జిల్లాలో ఓ అత్త దారుణానికి పాల్పడింది. కోడలిని అతి కిరాతకంగా హత్య చేసింది అత్త. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోడలిని దారుణంగా హత్య చేసిన అత్త కోడలి తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. రాయచోటిలోని కె.రామాపురానికి చెందిన సుబ్బమ్మ తన కోడలు వసుంధరను ఇంటికి భోజనానికి పిలిచింది. కోడలి హత్యకు అప్పటికే పథకం వేసుకున్న సుబ్బమ్మ, సమీప బంధువుల సాయంతో వసుంధరను అత్యంత దారుణంగా నరికి చంపింది. శరీరం నుంచి తలను వేరు చేసిన సుబ్బమ్మ... ఆ తల చేత పట్టుకొని సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటి టౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటనను చూసిన వారంతా భయపడిపోయారు. ఆస్తి గొడవల కారణంగా సుబ్బమ్మ ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వసుంధర మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హత్య చేసి అంత్యక్రియలకు
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం జై గిరి గ్రామానికి చెందిన లింగాల రాజుకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మార్చి 31, 2019 తేదీన సీసీ నస్పూర్ కు చెందిన పిడిశెట్టి శ్రీధర్ కు ఇచ్చి వివాహం చేశారు. కొద్ది రోజులకు ఒక కొడుకు పుట్టిన తరువాత తన బిడ్డను అల్లుడు కాపురానికి తీసుకెళ్లడం లేదని రాజు మనసులో పెట్టుకున్నాడు. ఈ లోపల అల్లుడు కూడా తన భార్య నుండి విడాకులు కావాలంటూ హనుమకొండ కోర్టులో కేసు వేశాడు. ఎన్నిసార్లు పంచాయితీలకు వెళ్లినా అతని తీరు మారలేదు. దీంతో ఈ విషయంలో పూర్తిగా తన అల్లుడి తల్లిదండ్రుల వ్యవహారం తెరవెనుక ఉండి నడిపిస్తున్నారని అనుమానించిన రాజు వారిని చంపితే గాని అల్లుడు దారికి రాడని హత్యకు కుట్ర పన్నాడు.
దొంగలు చేసినట్లు కవరింగ్
దీనికి బయటి వారి కంటే కొడుకు శ్రీకాంత్ పెద్ద కూతురు సాయి తేజ సహకారం అందించాలని కోరారు దీంతో వీరంతా కలిసి ఆగస్టు 8న మధ్యాహ్నం సమయంలో అల్లుడైన శ్రీధర్ ఇంటికి వెళ్లారు. అక్కడ శ్రీలత తండ్రి మొగిలి ఒంటరిగా కనిపించడంతో ముగ్గురు కలిసి దాడికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో చంపి తీరాలని రాజు, మొగిలి గొంతు బిగించగా శ్రీకాంత్ అక్కడే ఉన్నా దిండుతో అదిమిపట్టి హత్య చేశారు. దీనికి కోడలైన తేజశ్రీ కూడా పూర్తిగా సహకరించింది. అతని వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లను కూడా తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంది. ఇదంతా దొంగల పని లాగా కనబడాలని వారి ఇంట్లో ఉన్న బీరువా తెరిచి అందులో నుండి విలువైన బంగారు నగలను దొంగిలించింది.
గుండు చేయించుకుని
అంతేకాకుండా, మృతుడి జేబులో ఉన్న డబ్బులను సైతం తీసుకున్నారు. తిరిగి అక్కడి నుండి ఆటోలో మంచిర్యాల రైల్వే స్టేషన్ కి వెళ్లి ముగ్గురూ కలిసి హన్మకొండలోని తమ ఇంటికి వెళ్ళిపోయారు. మధ్యలో రైలు గోదావరి నది దాటుతుండగా తేజస్వి రెండు సెల్ ఫోన్లను నదిలోకి విసిరేసింది. మరోవైపు ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక చనిపోయిన విషయం ఇతరుల ద్వారా తెలుసుకున్నట్టు నటించిన రాజు గుండు చేసుకొని ఎవరు గుర్తు పట్టరని భావించాడు. అందరూ కలిసి ఏమీ జరగనట్టుగానే అంత్యక్రియలకు సైతం హాజరయ్యారు. అయితే, ఆ ప్రాంతంలో హత్య జరిగిన సమయంలో ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్స్.. అప్పటికే వీరిపై ఉన్న కారణంగా లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వీరు ముగ్గురు హత్య చేశామని ఒప్పుకున్నారు. ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డీసీపీ అభినందించారు.
Also Read : ప్రియురాలు పిలిచింది- వాట్సాప్ స్టాటస్ చూసి ప్రియుడి పెళ్లి ఆపేసింది