News
News
X

ప్రియురాలు పిలిచింది- వాట్సాప్‌ స్టాటస్‌ చూసి ప్రియుడి పెళ్లి ఆపేసింది

ఓ అమ్మాయిని ప్రేమించాడు. మరో యువతిని పెళ్లి చేస్కోబోయాడు. కానీ ప్రియురాలి ఎంట్రీతో పీఠల మీదే పెళ్లి ఆగిపోయింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

FOLLOW US: 

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపురంకు చెందిన బొద్దుల రాజేష్ అనే యువకుడి పెళ్లి గద్దేరాగడిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం రోజు జరుగుతోంది. వివాహ తంతు జరుగుతుండగానే... అక్కడకు ఓ అమ్మాయి వచ్చింది. అచ్చం తెలుగు సినిమాల్లో లాగానే పెళ్లి ఆపండి అంటూ గట్టిగా కేక వేసింది. ఏమైందంటూ అందరూ ఆమెను చూస్తున్నారు. ఆమె వధూవరులిద్దరూ స్నేహితురాలేమో, ఏదైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందేమోనని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె వచ్చింది వారిద్దరికి సర్ ప్రైజ్ ఇవ్వడానికి కాదు. షాక్ ఇవ్వడానికి. 

వచ్చింది బంధువు కాదండోయ్ వరుడి ప్రేయసి..

అదేంటీ అనుకుంటున్నారా. నిజమండి. ఆమె పెళ్లి కూతురుకో, పెళ్లి కుమారుడికో స్నేహితురాలు అయితే అదే జరిగేది. కానీ వచ్చింది నవ వరుడి ప్రేయసి. పెళ్లి పీఠల మీద కూర్చొని మరో అమ్మాయి మెడలో తాళి కట్టేందుకు రెడీగా ఉన్న రాజేష్ తనను ప్రేమించాడని, గత ఎనిమిదేళ్లుగా తామిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు బంధువుల అందరి ముందే చెప్పింది. అందుకే ఆ పెళ్లిని ఆపేసింది. తనను మోసం చేసిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె మాటలు విన్న అమ్మాయి తరపు బంధువులంతా ముక్కున వేలేస్కున్నారు. చోద్యం చూసినట్లుగా చూస్తుండిపోయారు. 

రాజేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే ఓ వైపు విలపిస్తూనే మరోవైపు పెళ్లి కొడుకుపై దుమ్మెత్తి పోశారు. ఇలాంటి వాడికా తమ కూతురును ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెతోపాటే పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు పెళ్లి కుమారుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

అసలేమైందంటే..?

పెళ్లి కుమారుడు బొద్దుల రాజేష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ప్రియురాలు రమినా కూడా గతంలొ రామకృష్ణపురంలోనే ఉండే వారని... అయితే కొన్నేళ్ళుగా ఆమె హుజూరాబాద్ లో ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. గతంలో రమినాకు ఓ యువకుడితో పెళ్లి జరిగింది. ఆ తరువాత వారు విడిపోవడంతో రాజేష్ పరిచయం అయ్యాడు. గత ఎనిమిదేళ్లుగా రాజేష్ తనను ప్రేమిస్తున్నాడని, తనను శారీరకంగాను వాడుకున్నాడని, గతేడాది అబార్షన్ కూడా చేయించాడని యువతి ఆరోపించింది. తనతో రాత్రి వరకు వాట్సాప్ లో చాట్ చేశాడని.. అసలు ఈ పెళ్ళి విషయం తనకేమి తెలియదని చెప్పింది. అయితే రాజేష్ వాళ్ల బంధువులో ఒకరు వాట్సప్ స్టేటస్ పెడితే ఈ పెళ్ళి విషయం తనకు తెలిసిందిని వివరించింది. 

నన్నెలా మోసం చేయాలనిపిందంటూ రమినా రోదన..

విషయం తెలిసి పెళ్లి మండపానికి పోలీసులతో సహా వచ్చానని.. అందుకే పెళ్లి ఆపేశానని రమినా వివరించింది. ఎనిమిదేళ్లుగా తనకు మాయ మాటలు చెప్పి ప్రేమించానని, శారీరకంగా వాడుకున్న నీకు నన్ను ఎలా వదిలేయాలనిపించింది అంటూ రాజేష్ కాలర్ పట్టుకొని అడిగింది. ఓ వైపు ఏడుస్తూనే, మరోవైపు కోపంతో ఊగిపోయింది. 

Published at : 11 Aug 2022 08:24 AM (IST) Tags: telangana latest news Marriage Stopped Girl Friend Entry in Lover Marriage Mancherial Latest News Mancherial Crazy Marriage News

సంబంధిత కథనాలు

రూటు మారుస్తున్న గంజాయి స్మగ్లర్లు- హైదరాబాద్ పోలీసుల నిఘాకు చిక్కకుండా స్కెచ్‌

రూటు మారుస్తున్న గంజాయి స్మగ్లర్లు- హైదరాబాద్ పోలీసుల నిఘాకు చిక్కకుండా స్కెచ్‌

Nellore News: నెల్లూరు కలెక్టరేట్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

Nellore News: నెల్లూరు కలెక్టరేట్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

Kamareddy News: చీప్‌ లిక్కర్‌ కొరతతో గ్రామాల్లో గుప్పుమంటున్న గుడుంబా!

Kamareddy News: చీప్‌ లిక్కర్‌ కొరతతో గ్రామాల్లో గుప్పుమంటున్న గుడుంబా!

బురఖాలో వచ్చి బ్యాంకులో 12 వేల కోట్లు కొట్టేశాడు- కేటుగాడి ప్లాన్ తెలిసి షాక్ తిన్న పోలీసులు

బురఖాలో వచ్చి బ్యాంకులో 12 వేల కోట్లు కొట్టేశాడు- కేటుగాడి ప్లాన్ తెలిసి షాక్ తిన్న పోలీసులు

Shamshabad Gold Seize : శంషాబాద్ ఎయిర్ పోర్టులో 7 కిలోల గోల్డ్ సీజ్, ముగ్గురు అరెస్ట్!

Shamshabad Gold Seize : శంషాబాద్ ఎయిర్ పోర్టులో 7 కిలోల గోల్డ్ సీజ్, ముగ్గురు అరెస్ట్!

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు