News
News
వీడియోలు ఆటలు
X

Nykaa: నైకాకు "బయ్‌" రేటింగ్‌, ₹214 టార్గెట్‌ ఇచ్చిన గ్లోబర్‌ బ్రోకరేజ్‌, ఈ లెక్క వెనకున్న కథేంటి?

ఈ స్థాయి నుంచి మరో రూ. 82 లేదా 62% పెరుగుదలను ఈ బ్రోకింగ్‌ హౌస్‌ అంచనా వేస్తోంది.

FOLLOW US: 
Share:

Namura - Nykaa: 2023 మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన రెవెన్యూ అప్‌డేట్స్‌ ప్రకటించిన తర్వాత, నైకా షేర్లు గురువారం సెషన్‌లో (06 ఏప్రిల్‌ 2023) పట్టుదప్పి పడిపోయాయి. 

గురువారం నాడు 3.70% లేదా రూ. 5.05 నష్టపోయిన నైకా షేర్‌ ధర (FSN E-commerce Ventures Limited Share Price), రూ. 131.60 వద్ద ముగిసింది.

షేర్‌ ప్రైస్‌లో ప్రైస్‌ కరెక్షన్‌ ఉన్నప్పటికీ, నైకా మీద పూర్తి బుల్లిష్‌గా ఉంది గ్లోబల్ బ్రోకింగ్‌ కంపెనీ నోమురా. ఈ స్థాయి నుంచి మరో రూ. 82 లేదా 62% పెరుగుదలను ఈ బ్రోకింగ్‌ హౌస్‌  అంచనా వేస్తోంది. FY25-40 కాలంలో కంపెనీ ఆదాయం 18% CAGR వద్ద పెరుగుతుందని, మార్జిన్లు 17.5% స్థిరంగా ఉంటాయని లెక్కలు వేసింది.

టార్గెట్‌ ప్రైస్‌ రూ.214 
ఈ లెక్కల ఆధారంగా నైకా షేర్‌కు "బయ్‌" రేటింగ్‌ ఇచ్చిన నోమురా, టార్గెట్‌ ధరగా రూ. 214 ను ప్రకటించింది.

వ్యాపారంలో స్థిరమైన వృద్ధి అంచనాలు
“Q3FY23లో బ్యూటీ & పర్సనల్ కేర్ (BPC) విభాగంలో నికర అమ్మకాల విలువ (NSV) గత సంవత్సరం కంటే 26.5% పెరిగింది. FY23 తొలి 9 నెలల్లో ((9MFY23) 34% వృద్ధి సాధించింది. గత సంవత్సరంతో పోలిస్తే, Q4FY23లో (2023 జనవరి-ఏప్రిల్‌ త్రైమాసికం) NSV వృద్ధి 28%గా ఉండొచ్చన్నది మా అంచనా. తద్వారా మొత్తం ఆర్థిక సంవత్సరంలో (FY23) 32% YoY వృద్ధి ఉంటుంది. FY23 కోసం గతంలో వేసిన అంచనా 31% కంటే ఇది కొంచెం ఎక్కువ" - నోమురా

కంపెనీ వ్యాపారం తిరిగి గాడిలో పడుతున్నట్లు కనిపిస్తోంది, FY23-25 కాలంలో ఇదే ఊపు కొనసాగి 27% CAGR వద్దకు (సాధారణ స్థాయి) చేరుతుందని మేం ఆశిస్తున్నాం అని బ్రోకరేజ్ తెలిపింది.

ఫ్యాషన్ విషయంలో, గత ఏడాదితో పోలిస్తే, ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (9MFY23) NSVలో 32% YoY వృద్ధి కనిపించింది. Q4FY23లో ఇది 17%గా నమోదు కావచ్చన్నది నోమురా లెక్క. ఫలితంగా మొత్తం FY23లో 28% YoY పెరుగుదల సాధ్యం అవుతుంది. FY23 కోసం గతంలో వేసిన 29% వృద్ధి అంచనా కంటే ఇది కొంచెం తక్కువ.

లాభదాయకత పెరుగుదల నేపథ్యంలో, BPC సెగ్మెంట్‌లో కంపెనీ కనబరుస్తున్న బలమైన వృద్ధిని స్టాక్‌ మార్కెట్‌ సానుకూలంగా తీసుకోవచ్చని గ్లోబల్ మార్కెట్ పరిశోధన సంస్థ తెలిపింది.

52 వారాల గరిష్ట స్థాయి నుంచి క్షీణత
2021 నవంబర్ 10ల తేదీన నైకా షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యాయి. 2022 ఏప్రిల్ 11వ తేదీన రూ. 315.44 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని (52-week high) తాకాయి, అక్కడి నుంచి కరెక్షన్‌లో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 15% పైగా నష్టపోయాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 07 Apr 2023 12:53 PM (IST) Tags: Stock Market buy rating FSN E-commerce

సంబంధిత కథనాలు

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

UPI: ఫోన్‌ తియ్‌-పే చెయ్‌, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్‌

UPI: ఫోన్‌ తియ్‌-పే చెయ్‌, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్‌

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Education Loan: సిబిల్‌ స్కోర్‌ తక్కువైనా ఎడ్యుకేషన్‌ లోన్‌ వస్తుంది, హైకోర్ట్‌ కీలక నిర్దేశం

Education Loan: సిబిల్‌ స్కోర్‌ తక్కువైనా ఎడ్యుకేషన్‌ లోన్‌ వస్తుంది, హైకోర్ట్‌ కీలక నిర్దేశం

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా