News
News
X

Horoscope Today 01st February 2023: ఈ రాశివారి ఉదయం కన్నా సాయంత్రం ఉత్సాహంగా ఉంటారు, ఫిబ్రవరి 1 రాశిఫలాలు

Rasi Phalalu Today 01st February 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Horoscope Today 01st February 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం

మేష రాశి
ఈ రాశి ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి. మానసికంగా బలంగా ఉంటారు. వ్యాపారులకు బాగానే ఉంటుంది. ఈ రాశివారు మాట్లాడేందుకు కొన్నిరోజులు సమయం పడుతుంది కానీ ఆ తర్వాత బాగా కలసిపోతారు. మాట్లాడేటప్పుడు ఎదుటివారిని  బాధపెట్టకుండా ఉండేందుకు ప్రయత్నించండి. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. 

వృషభ రాశి 
ఈ రోజు మీరు కాస్త నిరాశగా ఉంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఏదో విషయంలో నిరాశగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలున్నాయి. మీ మనసులో మాటని నేరుగా మాట్లాడటమే మంచిది

మిథున రాశి
ఈ రాశివారు ఉదయం నుంచి నిస్సత్తువుగా ఉంటారు కానీ సాయంత్రానికి ఉత్సాహంగా  కనిపిస్తారు. ఈ రాశి విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి తగ్గుతుంది. ఆరోగ్యం ఎలా ఉన్నప్పటికీ తాము చేయాల్సిన పనుల విషయంలో మాత్రం వెనక్కు తగ్గరు

Also Read: మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏంటి - ఆ రోజు సముద్రం స్నానం ఎందుకు చేయాలి!

కర్కాటక రాశి 
కర్కాటక రాశికి చెందిన రాజకీయాల్లో ఉన్నవారికి ఈ రోజు శుభప్రదమైన రోజు. అయితే మీ రహస్యాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. ఉద్యోగులు పని విషయంలో రాజీపడొద్దు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులు మంచి ఆఫర్లు పొందుతారు.

సింహ రాశి 
ఈ రోజు మీరు మీ భాగస్వామి ప్రేమలో మునిగితేలుతారు...కానీ వారిపై ప్రేమను వ్యక్తపరిచేందుకు మీకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులు తమ దృష్టిని చదువుపై తప్ప ఇతర విషయాలపై మళ్లకుండా ఉండేలా చూసుకోవాలి. 

కన్యా రాశి 
ఈ రోజు కన్యారాశి వారు ఎవరితోనూ గొడవ పడొద్దు. అది మీకు అంత మంచిగా అనిపించకపోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది కానీ ఎవరో ఒకరితో మీ విభేదాలు తెరపైకి వస్తాయి. మీరు సంయమనం పాటించడం ద్వారా నెమ్మదిగా సర్దుకుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

తులా రాశి 
ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ తప్పనిపరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.. ప్రజా రవాణా ఉపయోగించడం ఇంకా మంచిది.  తెలియని వ్యక్తులతో అనవసర  సంప్రదింపులు వద్దు

Also Read: ఈ రెండు తిథుల్లో ఏ పని ప్రారంభించినా అడ్డంకులు, అష్టకష్టాలు తప్పవా!

వృశ్చిక రాశి 
ఈ రాశివారు తీసుకున్న అప్పులు తీర్చేందుకు మంచి రోజు. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళితే భవిష్యత్ లో నష్టపోతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగులు పని విషయంలో వెనకడుగు వేయొద్దు. వ్యాపారం బాగానే సాగుతుంది.

ధనుస్సు రాశి
ఈ రాశివారి జీవితంలో పెద్దగా కొత్తదనం ఉండదు. రోజంతా ఏదో బిజీబిజీగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయించండి. మనసులో ప్రతికూల ఆలోచనలు అస్సలు రానివ్వవద్దు.

మకర రాశి
ఈ రోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండకపోతే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ మనసు చెప్పింది వినండి..ఎవ్వరి నుంచీ సలహాలు తీసుకోవద్దు.

కుంభ రాశి 
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. నూతన పెట్టుబడులకు శుభసమయం. వ్యాపారం బాగాసాగుతుంది. ఉద్యోగులు తమ టార్గెట్లు పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. ఏపని చేసినా ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి

మీన రాశి 
ఈ రోజు మీన రాశివారికి కూడా అనుకూల సమయం. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ మనసులో ఉన్న మాటని బయటకు చెప్పండి. కార్యాలయంలో మీకు అప్పగించిన పని పూర్తిచేయండి. కొత్త ఇల్లు కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. స్నేహితులను కలుస్తారు.

Published at : 01 Feb 2023 05:48 AM (IST) Tags: Horoscope Today Rasi Phalalu today Check astrological prediction today Aries Horoscope Today Gemini Horoscope Today bhogi Horoscope Today

సంబంధిత కథనాలు

మార్చి 31 రాశిఫలాలు,  ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

మార్చి 31 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

Sri Rama Navami 2023: ఈ 16 సుగుణాలే రాముడిని ఆదర్శపురుషుడిని చేశాయి!

Sri Rama Navami 2023: ఈ 16 సుగుణాలే రాముడిని ఆదర్శపురుషుడిని చేశాయి!

Sri Rama Navami 2023: ఆయన ఆకాశం - ఆమె పుడమి, అందుకే వారి కళ్యాణం లోకకళ్యాణానికి కారకం, ప్రకృతికి పులకరింతకు ప్రతీక

Sri Rama Navami 2023: ఆయన ఆకాశం - ఆమె పుడమి, అందుకే వారి కళ్యాణం లోకకళ్యాణానికి కారకం, ప్రకృతికి పులకరింతకు ప్రతీక

మార్చి 30 రాశిఫలాలు, ఈ రాశివారికి చుట్టూ సమస్యలే అయినా ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కుచెదరదు

మార్చి 30 రాశిఫలాలు, ఈ రాశివారికి చుట్టూ సమస్యలే అయినా ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కుచెదరదు

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు