News
News
X

Magha Pournami 2023: ఈ రోజు మాఘ పూర్ణిమ, ప్రాముఖ్యత ఏంటి - సముద్రం స్నానం ఎందుకు చేయాలి!

మాఘ పూర్ణిమ 2023: తెలుగు మాసాల్లో ప్రతి నెలకూ ఓ ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం దీపారాధనలకు ప్రసిద్ధి అయినట్టే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. ఈ నెల మొత్తంమీద మాఘ పౌర్ణమి మరింత ప్రత్యేకం

FOLLOW US: 
Share:

Magha Pournami 2023:  మాఘమాసంలో సూర్యోదయానికి ముందు పవిత్ర స్నానాలు చేయాలని చెబుతారు. ఈ ఏడాది మాఘపూర్ణిమ ఫిబ్రవరి 5న వచ్చింది.
    "మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ
     బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''

బ్రహ్మ ముహూర్తంలో జలాలన్నీ బ్రహ్మహత్య, సురాపానం లాంటి మహా పాతకాలను పోగొట్టి  పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉంటాయని అర్థం. 

మాఘపూర్ణిమ - మహామాఘి ఎందుకు ప్రత్యేకం
మకర సంక్రమణం నుంచి కుంభసంక్రమణం వరకు మధ్యకాలమే "మాఘమాసం''. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. మాఘపూర్ణిమను "మహామాఘి'' అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ "మాఘ పూర్ణిమ'' అత్యంత విశేషమైనది. ఈ "మహామాఘి'' శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేయాలంటారు. 

సముద్రస్నానం ఎందుకు చేయాలంటే?
    నదీనాం సాగరో గతి
సకల నదీ, నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. అందుకే సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏంటటే నిత్యం సూర్యకిరణాలవల్ల, ఎంత నీరు ఆవిరి అవుతున్నా సముద్రం పరిమాణం తగ్గదు. అలాగే, ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. అఘాది, జడత్వాలు ఆయన తత్త్వం. సాగరుడు సంతోశప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా "ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ''రోజుల్లో చేయాలని..అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాల్లో ఉంది

Also Read: ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం - పరమేశ్వరుడి బాహువులు పడిన ప్రదేశం ఇది

నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిల్చుని కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. సూర్యోదయకాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని, ఔశదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. 

సముద్రం, నదుల్లో స్నానమాచరించలేనివారు బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ "గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి'' నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే, మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందుతారు. చివర మూడుస్నానాలనూ "అంత్యపుష్కరిణీ స్నానాలు'' అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే, మాఘమాసం, మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.

    "దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
     ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
     మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
     స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''
అని పఠించి మౌనంగా స్నానం చేయాలి, అంటే "దుఃఖం, దారిద్ర్యం, పాపం నశించడానికి ఈ పవిత్ర మాఘ స్నానం చేయుచున్నానని అర్థం. అందుకే  ఓ గోవిందా! అచ్యుతా! మాధవా! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు'' అని అర్థం.

Also Read: ఈ రాశివారు తొందరపాటు తగ్గించుకోవాలి, వివాదాలకు దూరంగా ఉండాలి - ఫిబ్రవరి 5 రాశిఫలాలు

స్నానం అనంతరం
    "సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ   
    త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''
అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే "ఓ పరంజ్యోతి స్వరూపుడా! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు నశించుగాక'' అని అర్థం. ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత, పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని, ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత దానధర్మాలు చేయాలి. 

పూర్ణిమకు సముద్ర స్నానానికి సంబంధం ఏంటి
పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు సముద్రానికి "పోటు'' ఎక్కువగా ఉంటుంది. "పూర్ణిమ'' దైవసంబంధమైన తిథి ... అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం. జ్యోతిష శాస్త్ర రీత్యా  పూర్ణిమ, అమావాస్య తిథుల్లో సూర్య-చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి ఉంటారని చెబుతారు. 

Published at : 31 Jan 2023 09:41 AM (IST) Tags: magha pournami 2023 : Magha Purnima Maha Maghi: Importance Spiritual Significance of magha pournami and pooja vidhi in telugu

సంబంధిత కథనాలు

మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం

మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం

యాదాద్రిలాగే బాసర కూడా కృష్ణశిలాశోభితం

యాదాద్రిలాగే బాసర కూడా కృష్ణశిలాశోభితం

వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!

Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం