Andhra News : టీడీపీ బ్యాంక్ ఖాతాలపై సీఐడీ గురి - వివరాలివ్వాలని నోటీసులు !
AP CID Notices To TDP : ఏపీ సీఐడీ పోలీసులు తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేశారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
AP CID Notices To TDP : తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని ఏపీ సీఐడీ ( AP CID ) పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాడేపల్లిలోని టీడీపీ ( TDP Office ) కేంద్ర కార్యాలయంలో సీఐడీ కానిస్టేబుల్ ఒకరు ఈ నోటీసులు ఇచ్చారు. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు ( MLC Ashok Babu ) నోటీసు ఇచ్చి వెళ్లారు సీఐడీ కానిస్టేబుల్. ఈనెల 18లోగా వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొన్నది. స్కిల్ కేసుకు సంబంధించి పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు కావాలన్న సీఐడీ కోరింది. ఇప్పటికే సీఐడీ అధికారులు వేధిస్తున్నారంటూ ఇప్పటికే హైకోర్టును తెలుగుదేశం పార్టీ ఆశ్రయించింది.
టీడీపీ, లోకేష్‌తో ఏ పంచాయతీ లేదంటున్న కేటీఆర్ - సీమాంధ్ర మూలాలున్న ఓటర్ల అసంతృప్తిని గుర్తించారా ?
తెలుగుదేశం పార్టీ హయాంలో అమలు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు నోదు చేసింది. రెండున్నరేళ్ల కిందట కేసు నమోదు చేసి పలువుర్ని అరెస్టు చేశారు. అందరూ బెయిల్ పై విడుదలయ్యారు. ఇటీవల టీడీపీ అధినతే చంద్రబాబును ఏ 37గా చేర్చి ఆయనను కూడా రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. కానీ చంద్రబాబుకు ఎలా లబ్ది కలిగిందో మాత్రం కోర్టుకు చెప్పలేకపోయారు. ఇటీవల చంద్రబాబుకు కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది. గత విచారణలో అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో వాయిదా కోరారు. పదిహేనో తేదీన విచారణ జరగాల్సి ఉంది. ఇప్పుడు పధ్నాలుగో తేదీన టీడీపీకి నోటీసులు ఇవ్వడం .. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా కోరడానికో లేకపోతే.. నోటీసులు ఇచ్చామని విచారణ జరుగుతోందని చెప్పడానికో ఇచ్చి ఉంటారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
వచ్చే ఎన్నికలను లైఫ్ అండ్ డెత్ గా తీసుకున్న జేసీ కుటుంబం - గెలిచేందుకు ఏం చేస్తున్నారంటే ?
ఇప్పటి వరకూ మనీ ట్రయల్ కు సంబంధించి సీఐడీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోతే కేసులు ఎలా పెట్టారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఖాతాలోకి 27 కోట్ల రూపాయలు వచ్చాయని సీఐడీ అదికారులు చెబుతున్నారు. ఎవరు ఇచ్చారో కూడా సీఐడీ చెప్పడం లేదు కానీ.. ఈ మొత్తం స్కిల్ స్కామ్ కాంట్రాక్టు పొందిన వారే ఇచ్చారని ఇది లంచం అని సీఐడీ ఆరోపిస్తోంది. అయితే అవి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వ రుసుమ అని.. సీఐడీ ఉద్దేశపూరవకంగానే తమను వేధిస్తోందని టీడీపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేశారు. సీఐడీ తప్పుడు పద్దతుల్లో సమాచారం తీసుకుందని.. ఇప్పటికీ తమను వేధిస్తోందని ఇప్పటికే టీడీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై బధవారం విచారణ జరగనున్న సమయంలో మంగళవారం సీఐడీ నోటీసులు ఇవ్వడం.. కుట్రలో భాగమేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామంటున్నారు.