Crtime News: ఎగ్జామ్ ఫెయిల్ భయం, హైదరాబాద్‌లో టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్యతో విషాదం

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ఎవరు ఏ సమయంలో ఏ తీవ్ర నిర్ణయం తీసుకుంటారో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు మందలించారని, మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్య చేసుకుని కన్నవాళ్లకు కన్నీళ్లు మిగుల్చుతున్నారు. హైదరాబాద్ లో అలాటి విషాదం ఒకటి జరిగింది. పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇటీవల 10 తరగతి పరీక్షలు రాసిన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని మిగిల్చుతోంది.
హైదరాబాద్ లోని అల్వాల్ లో ఘటన జరిగింది. సంజయ్ కుమార్ అనే విద్యార్థి వర్గల్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో చదువుకుంటున్నాడు. గత నెలలో టెన్త్ పరీక్షలు రాశాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. గత వారం రోజుల నుంచి టెన్త్ క్లాస్ ఫలితాలపై అప్ డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాను టెన్త్ పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి సంజయ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్షలే జీవితం కాదని, ఇంకా ఎన్నో రంగాల్లో రాణించవచ్చు అని నిపుణులు, అధికారులు చెబుతూనే ఉంటారు. ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్న నేతలు సైతం కొందరు పది పాస్ కాని వారు ఉంటారని చెబుతున్నా.. విద్యార్థులు మాత్రం తల్లిదండ్రులు ఏమంటారోననే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఇటీవల ఏపీలో టెన్త్, ఇంటర్ ఫలితాలు విడులయ్యాయి. తక్కువ మార్కులొచ్చాయని కొందరు విద్యార్థులు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామంటూ కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలోనూ ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాక, ఫెయిల్ అయ్యామనే కారణంగా కొందరు విద్యార్థులు బలవన్మరణం చెందారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)





















