Bihar Elections: బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం - ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
NDA Bihar CM Face: బీహార్ ఎన్నికల్లో నితీషే మళ్లీ సీఎం అనే ప్రకటన చేయాలని ఆర్జేడీ సవాల్ చేస్తోంది. దీనికి మోదీ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. నితీష్ నాయకత్వంలో గెలుస్తామన్నారు.

PM Modi Announces NDA Bihar CM Face: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. సమస్తీపూర్‌లో జరిగిన ఎన్‌డీఏ ఎన్నికల మీటింగ్‌లో ముఖ్యమంత్రి నీతిష్ కుమార్‌ను సీఎం అభ్యర్థిగా పరోక్షంగా మోదీ ప్రకటించారు. నీతిష్ కుమార్ నాయకత్వంలో ఎన్‌డీఏ అన్ని ఎన్నికల రికార్డులను అధిగమించే విజయం సాధిస్తుందని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన ఆర్‌జేడీ-కాంగ్రెస్ సీఎం అభ్యర్థి గా తేజస్వి యాదవ్ ప్రకటించడానికి కౌంటర్ గా భావిస్తున్నారు.
#WATCH समस्तीपुर, बिहार: प्रधानमंत्री मोदी ने कहा, "लोकतंत्र के महापर्व का बिगुल बज चुका है। पूरा बिहार कह रहा है कि फिर एक बार NDA सरकार, फिर एक बार सुशासन सरकार... जंगलराज वालों को दूर रखेगा बिहार..." pic.twitter.com/ydJmxJ8O9x
— ANI_HindiNews (@AHindinews) October 24, 2025
సమస్తీపూర్ భారతరత్న మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ స్వస్థలం . మొదట కర్పూరి ఠాకూర్ కుఆయన అయన అడుగుజాడల్లో పేదలు, వెనుకబడిన వర్గాలకు సేవ చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈబీసీలను ఆకట్టుకోవడం ద్వారా బిహార్ ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. నితీష్ కుమార్ ఆరోగ్యంపై పుకార్లు వస్తున్న సమయంలో .. తేజస్వీ యాదవ్ ..బీజేపీ కూటమిపై సెటైర్లు వేస్తున్నారు. నితీష్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని..గెలిస్తే ఆయనే సీఎం అవుతారని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ నితీష్ నేతృత్వంలోనే విజయం సాధిస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.
PM Modi endorses #NitishKumar, leaving no room for any unwanted speculation by #Mahathugbandhan
— Sanju Verma (@Sanju_Verma_) October 24, 2025
NDA is all set for a thumping victory,come 14th Nov, under the unstoppable Modi juggernaut💪💪 pic.twitter.com/m6pNDPP0Vd
బీహార్‌లో రెండు కూటముల మధ్య పోరు సాగుతోంది. మూడో పార్టీగా ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ ఒంటరిగా పోటీ చేస్తోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రచార బరిలోకి దిగారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కూడా కీలకంగా మారింది.
2020 ఎన్నికల్లో ఎన్‌డీఏ 125 సీట్లు గెలుచుకుంది, మహాగథ్‌బంధన్ 110 సీట్లు సాధించింది. ఈసారి ఈబీసీలు (17% ఓటు బ్యాంక్), యాదవులు, ముస్లింలు మీద పోటీ ఉద్ధృతమవుతోంది. మోదీ ప్రకటన ఎన్‌డీఏలో నీతిష్ కుమార్‌కు బలం చేకూర్చడంతో పాటు, బీజేపీ అంతర్గత విభేదాలను అణచివేయడానికి ఉద్దేశించినదిగా విశ్లేషకులు భావిస్తున్నారు.






















