Bharat taxi: ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వ భారత్ టాక్సి యాప్ - డైవర్లకే 100శాతం ఆదాయం - ఇవిగో పూర్తి డీటైల్స్
Bharat taxi app: ఓలా-ఉబర్‌లకు ప్రత్యామ్నాయంగా కేంద్రం 'భారత్ టాక్సీ' యాప్ తీసుకు వస్తోంది. కమిషన్ లేకుండా 100% ఆదాయం డ్రైవర్లకు ఇస్తారు.

Government is bringing Bharat taxi app: ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీస్‌ల వల్ల డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయంలో కమిషన్లు తీసుకోవడంతో పాటు అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. అలాగే రెయిడ్ కు వెళ్లాల్సిన వారూ ఇబ్బందులు పడుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశ మొదటి కో-ఆపరేటివ్ టాక్సీ సర్వీస్‌గా 'భారత్ టాక్సీ'ను ప్రవేశపెడుతోంది. ఈ సర్వీస్‌లో డ్రైవర్లు లేదా వాహన యజమానులు కంపెనీకి ఏ కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి రైడ్ ఆదాయం 100% వారి జేబులోనే పోతుంది. దీంతో డ్రైవర్లు ప్రైవేట్ అప్‌లకు బదులు భారత్ టాక్సీని ఎంచుకుంటారని, ఓలా-ఉబర్‌కు ఇది పెద్ద ఛాలెంజ్‌గా మారనుంది.
భారత్ టాక్సీ సర్వీస్ డిసెంబర్ నుంచి పెద్ద ఎత్తున ప్రారంభమవుతుంది. పైలట్ ప్రాజెక్ట్ గా నవంబర్‌లో రాజధాని ఢిల్లీలో అమలు చేయనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టులో 650 మంది డ్రైవర్లు/వాహన యజమానులు పాల్గొంటారు. అంటే 650 వాహనాలు సర్వీస్‌కు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ నాటికి సుమారు 5,000 మంది డ్రైవర్లు చేరి, వివిధ నగరాల్లో ప్రజలకు సేవలు అందిస్తారు. డిసెంబర్ నుంచి ఈ సర్వీస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. మొదటి దశలో ఢిల్లీతో పాటు ముంబై, పూణే, భోపాల్, లక్నౌ, జైపూర్ మొదలైన 20 నగరాల్లో అందుబాటులోకి వస్తుంది. సహకార మంత్రిత్వ శాఖ , నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) కలిసి ఈ సర్వీస్‌ను రూపొందించాయి. కేంద్రం 'సహకార్ టాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్'తో ఎంఓయూ (MoU) కుదుర్చుకుంది.
భారత్ టాక్సీ ప్రైవేట్ కంపెనీల మాదిరిగా కాకుండా, సహకార సంస్థగా పనిచేస్తుంది. ఇక్కడ డ్రైవర్లు కూడా కో-ఓనర్లుగా ఉంటారు. సర్వీస్‌ను 'సహకార్ టాక్సీ' నడుపుతుంది. దీని కోసం ఓ సంఘం ఏర్పాటు చేశారు. అమూల్ డెయిరీస్‌కు ప్రసిద్ధి చెందిన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతాను ఈ కౌన్సిల్ చైర్మన్‌గా నియమించారు. వివిధ సహకార కమిటీల నుంచి 8 మంది సభ్యులు ఇందులో భాగస్వాములు. ఈ మోడల్ అమూల్ వంటి సహకార సంస్థల మాదిరిగా పనిచేస్తుంది. డ్రైవర్లు మెంబర్‌షిప్ ప్లాన్‌లో చేరి, రోజువారీ, వారపు లేదా మాసిక ఫీజులు చెల్లించాలి. ప్రతి రైడ్ నుంచి వచ్చే ఆదాయం పూర్తిగా వారిది. కంపెనీకి ఏ కమిషన్ లేదు.
Drive empowerment with every ride!
— MyGovIndia (@mygovindia) August 18, 2025
Be the creative force behind Bharat Taxi; India’s 1st cooperative-led taxi platform.
Design its Logo & Tagline today!
👉 https://t.co/eG2wn8ZqyO #BharatTaxi #CooperativeIndia@MinOfCooperatn pic.twitter.com/EVux89i2Yh
భారత్ టాక్సీని ఉపయోగించడం ఓలా-ఉబర్ అప్‌ల మాదిరిగానే సులభం. యాండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'భారత్ టాక్సీ' అప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ధరల విషయంలో భారత్ టాక్సీలో స్పష్టమైన వివరాలు ఇంకా ప్రకటించబడలేదు, కానీ ప్రైవేట్ అప్‌ల మాదిరిగానే ఉంటాయని అంచనా. ఓలా-ఉబర్‌లో 20-30% కమిషన్ చెల్లించాల్సి వస్తుంది. భారత్ టాక్సీ ప్రవేశంతో మార్కెట్‌లో పోటీ తీవ్రమవుతుంది. ఇది సహకార ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, డ్రైవర్లకు మెరుగైన ఆదాయాలు అందిస్తుంది. ముఖ్యంగా నగరాల్లో నిరుద్యోగ యువకులకు కొత్త అవకాశాలు తెరుస్తుందని భావిస్తున్నారు.





















