Bison Movie review Telugu | మారిసెల్వరాజ్ - ధృవ్ విక్రమ్ బైసన్ తో అదరగొట్టారా.? | ABP Desam
బైసన్.. మై సన్ కాదు.. బైసన్. ధృవ్ విక్రమ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో పా రంజిత్ ప్రొడక్షన్‌లో వచ్చిన మూవీ బైసన్. టిపికల్ తమిళ్ లోకల్ ఫ్లేవర్ ఉన్న ఓ ఊరి కథ ఇది. పా రంజిత్ సినిమా కాబట్టి.. కులాల కుమ్ములాటల్ని, అణగారిన వర్గాలపై జరిగే వివక్ష కూడా బలంగా కనిపిస్తుంది. ఫస్ట్ సినిమా స్టోరీ విషయానికొస్తే.. సింపుల్ లైన్. ఓ మారుమూల, చిట్టచివరి గ్రామంలో ఉండే అట్టడుగు అణగారిన వర్గానికి చెందిన కిట్టన్ అనే కుర్రాడు.. తన జీవితంలో, తన ఊళ్లో, తన ఊరి జనాల్లో తరతరాలుగా పాతుకుపోయిన పగలు, ప్రతీకారాలను దాటుకుంటూ కులాల కంచెలని తెంచుకుంటూ.. తన కబడ్డీ కలని ఎలా నెరవేరచుకున్నాడనేదే మూవీ స్టోరీ. ఇక ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూలో హీరోయిన్ అనుమప చెప్పినట్లు మారి సెల్వరాజ్ మార్క్ మట్టి వాసన వచ్చే సినిమా ఇది. సినిమా చాలా మంచి సినిమా. సమాజంలోని సమస్యలని కళ్లకు కట్టినట్లు చూపించే సినిమా. కిట్టన్ పాత్రని హీరో ధృవ్ కంప్లీట్‌గా అడాప్ట్ చేసుకున్నాడు. ఒకవేళ చియాన్ విక్రమ్ కుర్రాడిగా మారి యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ అలాగే ఉన్నాడు. హీరో క్యారెక్టర్‌కి అస్సలు ఏ మాత్రం హీరోయిజం ఉండదు. చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలన్నీ అనుభవిస్తూ.. కన్నీళ్లని దిగమింగుకుంటూ కబడ్డీయే ప్రాణంగా బతికే క్యారెక్టర్ హీరోది. అయితే అనుపమ క్యారెక్టర్ అంత బలంగా కనిపించలేదు. అసలు మూవీలో తనకున్న సీన్లే వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. అందులోనూ మూవీపై ఇంపాక్ట్ చూపించే క్యారెక్టర్ అయితే ఏ మాత్రం కాదు. హీరోయి సపోర్ట్ చేసే అక్కగా రిజిష విజయన్ తన పాత్రకి జస్టిఫై చేసింది. అయితే మూవీలో ది బెస్ట్ క్యారెక్టర్ పసుపతి. కులాల కక్షలతో, వర్గాల మధ్య పగలతో రగిలిపోయే ఊరిలో కొడుకుని ప్రాణంగా ప్రేమిస్తూ.. తన కొడుకు ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం ఎంత కష్టానికైనే వెనుకాడని తండ్రిగా.. అద్భుతంగా నటించారు పశుపతి. ఆ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవ్వరూ చేయలేరేమో అనిపించింది. అయితే బైసన్ మూవీ చాలా మంచి సినిమా అయినా కానీ.. టిపికల్ లోకల్ ఫ్లేవర్ మూవీస్ ఇష్టపడే ఆడియెన్స్ తప్ప.. ఓ సాధారణ ప్రేక్షకుడికి ఈ సినిమా అంతగా నచ్చే అవకాశం ఉండదు. దానికి తోడు.. స్టోరీలో ఎక్కువ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసి.. సినిమాని అనవసరంగా క్రిటికల్ మూవీగా మార్చేశాడు డైరెక్టర్ మారి. ఫర్ ఎగ్జాంపుల్.. హీరోయిన్ క్యారెక్టర్ హీరోకంటే ఏజ్‌లో ఎక్కువ.ఊళ్లలో ఉండే.. ఏజ్ ఫ్యాక్టర్ నమ్మకాన్ని తప్పుపట్టాలి అనుకున్నారు.. కానీ సిగ్నిఫికెన్స్ సీన్స్‌తో ఆ పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. నెక్ట్స్ ఊరిలో ఉండే పగలు, ప్రతీకారాలని చూపించాడు. బట్.. దానికి కూడా ఓ బలమైన కంక్లూజన్ ఇవ్వలేకపోయాడు. ఆ తర్వాత స్పోర్ట్స్‌లో ఉండే పాలిటిక్స్‌ని, ఆ పాలిటిక్స్‌తో ట్యాలెంట్‌ని ఎలా తొక్కేస్తారో చూపించాలనుకున్నాడు. బట్.. ఆ విషయాన్ని కూడా చాలా లైటర్ వేలో అలా టచ్ చేసి వెళ్లిపోయాడు. దీని వల్ల అంతపెద్ద ప్రాబ్లమ్ ఏ మాత్రం ఇంపాక్ట్ లేకుండా ఎండ్ అయిపోతుంది. పోనీ.. సినిమాకి పివటల్ పాయింట్ అయిన కబడ్డీ స్పోర్ట్‌ని అయినా.. ఎలివేట్ చేసి.. ఆడియెన్స్‌ని కట్టిపడేసేలా ఏవైనా హార్ట్ టచింగ్ మూమెంట్స్ చూపించాడా అంటే.. కనీసం మూవీలో మనకి ఒక్క కబడ్డీ మ్యాచ్ కూడా కంప్లీట్‌గా చూపించడు. సినిమాలో క్లైమాక్స్ మ్యాచ్‌లో ఫైనల్ రైడ్ తప్పితే.. మూవీలో ఎక్కడా కబడ్డీ స్పోర్ట్‌కి మనం కనెక్ట్ కాలేం. ఆ విషయంలో కూడా డైరెక్టర్ మారి ఫెయిల్ అయ్యాడు. ఇక మూవీలో ఫస్ట్ నుంచి.. ఇండియా, పాకిస్తాన్ సెంటిమెంట్‌ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. మరి అదైనా బలంగా చూపించాడా అంటే.. అదీ లేదు. జస్ట్ ఇండియా, పాకిస్తాన్ అంటే జనాలు ఇంట్రస్ట్‌గా చూస్తారు.. అనే ఉద్దేశం తప్పితే.. ఇంత రైవల్రీ పెట్టినప్పుడు.. కనీసం దానికి న్యాయం చేయకపోతే జనాలు తిడతారు అనే ఆలోచన కూడా చేయలేదు డైరెక్టర్. ఇక మూవీలో బాగా డిజప్పాయింట్ చేసిన యాస్పెక్ట్ కెమెరా వర్క్. స్పోర్ట్స్ జోనర్ సినిమాలలో కెమెరా వర్క్ అద్భుతంగా వాడి స్పెక్టాక్యులర్ సీన్స్ చూపించొచ్చు. కానీ.. సినిమాలో ప్రతి మ్యాచ్‌ని ఏదో ప్రో కబడ్డీ లీగ్ లైవ్ మ్యాచ్ చూపించినట్లు వైడ్ యాంగిల్ షాట్స్ తప్ప.. ఇంపాక్ట్‌ఫుల్ షాట్ ఒక్కటి కూడా చూపించలేదు కెమెరామెన్ ఎజిల్ అరసు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. అలాగే పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే వాల్లకి కూడా వాళ్ల వాళ్లలో కూడా ఒక మంచి షేడ్ ఉంటుందని, వాళ్ల పగకి వాళ్ల దగ్గర బలమైన జస్టిఫికేషన్ ఉంటుందని చూపించాడు. ఫైనల్‌గా ఈ మూవీ ఓ సెట్ ఆఫ్ ఆడియెన్స్‌కి మాత్రమే నచ్చే సినిమా. సో.. ఇది బైసన్ రివ్యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్ట్స్ ఇంకో మూవీ రివ్యూతో మీముందుకొస్తాను. అన్‌టిల్ దెన్ దిస్ ఈజ్ కార్తికేయ. సైనింగ్ ఆఫ్





















