Erragadda Public Talk Jubilee hills By poll : నవీన్ యాదవ్ vs మాగంటి సునీత జూబ్లీహిల్స్ ఎవరివైపు |ABP
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్నాయి. ఓ వైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది నవీన్ యాదవ్ గెలుపు వ్యూహాలతో దూసుకుపోతుంటే, గతంలో జరిగిన అభివృద్ది, సెంటిమెంట్ లతో బీఆర్ ఎస్ అభ్యర్ది మాగంటి సునీత ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. స్దానికంగా పట్టున్న లంకల దీపక్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్దిగా బీజేపీ సైతం పోటీకి సై అంటోంది. కమలం గెలుపు లెక్కలు వేరే లెవల్ అంటోంది.జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఓటర్లు ఏ పార్టీ అభ్యర్దికి పట్టం కట్టబోతున్నారు. పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్దులపై, ఆయా పార్టీలపై ఓటర్ల అభిప్రాయాలేంటి.? తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబిపి దేశం. నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీత, దీపక్ రెడ్డి.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరివైపు..!? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచేది ఎవరు..!? ఎర్రగడ్డ నాడి ఏంటీ అక్కడి Public Talk ఏంటో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం.





















