Paresh Rawal: నా యూరిన్ తాగి గాయం నుంచి కోలుకున్నా - 'శంకర్‌దాదా ఎంబీబీఎస్' నటుడి కామెంట్స్ వైరల్
Paresh Rawal Urine Comments: బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. గాయం నుంచి కోలుకునేందుకు తన యూరిన్ తాగానని చెప్పారు.

Paresh Rawal Said He Drank His Own Urine To Heal His Wound: బాలీవుడ్ యాక్టర్ పరేష్ రావల్ (Paresh Rawal) తాజాగా యూరిన్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. గాయం నుంచి కోలుకోవడానికి తన యూరిన్ తానే తాగానని ఓ ఇంటర్వ్యూల్లో చెప్పడం వైరల్‌గా మారింది.
యూరిన్ తాగి కోలుకున్నా..
'లాలంటాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన మోకాలికి గాయం అయితే ముంబైలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. 'ఆ సమయంలో అజయ్ దేవగణ్ (Ajay Devgn) తండ్రి వీరు దేవగణ్ (Veeru Devgn) నన్ను చూసేందుకు వచ్చారు. త్వరగా కోలుకునేందుకు ఓ సలహా ఇచ్చారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే నా యూరిన్ తాగమని చెప్పారు. అలాగే, స్మోకింగ్, డ్రింకింగ్, మాంసం మానేయాలని అన్నారు.
ఆయన సలహా పాటించాలని నేను నిర్ణయించుకున్నా. ఒకవేళ నా మూత్రం నేనే తాగాల్సి వస్తే.. ఒకేసారి తాగకూడదని, బీరులా తాగాలని నిర్ణయించుకున్నాను. 15 రోజులు అలానే చేశాను.' అని చెప్పారు.
డాక్టర్లు షాక్ అయ్యారు
ఆ తర్వాత తన ఎక్స్ రే చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారని పరేష్ రావల్ తెలిపారు. 'ఇంత త్వరగా గాయం ఎలా నయం అయ్యిందని డాక్టర్లు ఆశ్చర్యపోయారు. 'ఈ సిమెంటింగ్ ఎలా జరిగింది?' అని నన్ను అడిగారు. డాక్టర్లు తెల్లటి గీత ఏర్పడడం చూశారు. రెండున్నర నెలల తర్వాత డిశ్చార్జ్ కావాల్సిన నేను వీరు దేవ్‌గణ్ ఇచ్చిన సలహా వల్ల నెలన్నరకే డిశ్చార్జ్ అయ్యాను. ఆయన సలహా నాకొక మ్యాజిక్‌లా పని చేసింది.' అని చెప్పారు.
ఆ కామెంట్స్‌పై విమర్శలు
పరేష్ రావల్ కామెంట్స్‌పై నెట్టింట తీవ్ర చర్చ సాగుతోంది. ఆయన వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. యూరిన్ తాగడంతో గాయం నయం అయ్యిందనే పరేష్ వాదనను కొందరు వైద్య నిపుణులు ఖండించారు. ఓ వైద్యుడు 'ఎక్స్' వేదికగా అలా చెయ్యొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. 'నెటిజన్లు పరేష్ సలహాను గుడ్డిగా పాటించొద్దు. దయచేసి అలా చెయ్యొద్దు. యూరిన్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.' అని స్పష్టం చేశారు.
నిజానికి మూత్రం తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుందంటూ సదరు వైద్యుడు రాసుకొచ్చారు. 'వాస్తవానికి మూత్రం తీసుకోవడం హానికరం కావొచ్చు. బ్యాక్టీరియా, టాక్సిన్స్, ఇతర హానికర పదార్థాలు రక్త ప్రవాహంలోకి చేరే అవకాశం ఉంది. కిడ్నీలు మీ శరీరం నుంచి విషపూరిత పదార్థాలను తొలగించేందుకు చాలా శ్రమిస్తాయి. దానిని తిరిగి లోపలికి పంపడం ద్వారా అది మరింత కష్టం అవుతుంది. యూరిన్ తీసుకుంటే అది మరిన్ని అరోగ్య సమస్యలకు దారి తియ్యొచ్చు.' అని అన్నారు.
Please don't drink your urine (or others) because a Bollywood actor says so.
— TheLiverDoc (@theliverdr) April 27, 2025
There is no scientific evidence to support the idea that drinking urine provides any health benefits.
In fact, consuming urine can be harmful, potentially introducing bacteria, toxins, and other… https://t.co/lSyr2p25uY






















