Pak Gets C130 Support: యుద్ధ భయంతో టర్కీ సాయం కోరిన పాక్, ఆయుధాలతో ఇస్లామాబాద్ చేరిన సీ130 మిలటరీ విమానం
పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ యుద్ధానికి సన్నద్ధం అవుతోంది. అందులో భాగంగా టర్కీ సాయం తీసుకుంది. షరీఫ్ కోరడంతో ఎర్డోగాన్ పాకిస్తాన్ కు ఆయుధాలు, ఇంధనం అందించింది.

Pahalgam Terror Attack: పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారతదేశం నుంచి దాడులు ఎదుర్కోవాల్సి వస్తోందని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. అందుకు పహల్గాంలో ఉగ్రదాడిపై మొదట పాక్ ప్రభుత్వం చేసిన కామెంట్లు కారణం. ఈ క్రమంలో పాకిస్తాన్ యుద్ధానికి సన్నద్దమవుతోంది. తమ మిత్ర దేశం టర్కీని పాక్ సహాయం కోరింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం, టర్కీకి చెందిన సి-130 మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానం పాకిస్తాన్ చేరుకుంది. ఈ విమానంలో టర్కీ పాకిస్తాన్‌కు ఇంధనంతో పాటు ఆయుధాలు తరలించినట్లు సమాచారం. పాకిస్తాన్ సైన్యానికి ఇంధనం కొరత తీవ్రగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం భారీ యుద్ధాలు లాంటివి చేయడం అసాధ్యం.
మరో విషయం ఏమిటంటే పహల్గాం ఉగ్రదాడి రోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అంకారాలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో సమావేశంలో ఉన్నారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి. పాక్ కు సహాయం చేసే దేశాలలో టర్కీ ఒకటి. ఇది ఐక్యరాజ్యసమితితో సహా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ వివాదాన్ని లేవనెత్తుతూ ఉంటుంది.
Türkiye, Pakistan’a büyük miktarda silah sevkiyatı yaptı. Türkiye’den Pakistan’a toplam 6 adet A400M askeri kargo uçağı ile birlikte birçok C-130 uçağı iniş yaptı.
— Turkish Defence Agency (@tdefenceagency) April 28, 2025
Asya Temsilcimiz Shamir Ahmad pic.twitter.com/jqS1nbeYMx
పహల్గాం దాడిపై త్వరగా దర్యాప్తు చేయాలి
చైనా తన మిత్ర దేశం పాకిస్తాన్ సార్వభౌమత్వం, భద్రతా ప్రయోజనాలను కాపాడటంలో తన మద్దతును వ్యక్తం చేసింది. జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిపై భారత్ త్వరగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చైనా కోరినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది. చైనా ప్రభుత్వ వార్తా సంస్థ 'షిన్హువా' ప్రకారం.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆదివారం నాడు పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో టెలిఫోన్ కాల్ లో మాట్లాడారు. తన నివేదికలో డార్ వాంగ్ (చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిపిసి) కేంద్ర కమిటీ రాజకీయ బ్యూరో సభ్యుడు) కి 'కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగిందని రిపోర్ట్ చేసింది.
వాంగ్ ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటం అనేది ప్రపంచవ్యాప్తంగా సామూహిక బాధ్యతగా భావించాలని ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా నిరంతరం మద్దతు ఇస్తుందన్నారు. వాంగ్‌ను ఉటంకిస్తూ, 'బలమైన స్నేహితుడు, శాశ్వత వ్యూహాత్మక భాగస్వామిగా పాకిస్తాన్ ఆందోళనలను చైనా పూర్తిగా అర్థం చేసుకుంటుంది. దాంతోపాటు పాకిస్తాన్ సార్వభౌమత్వం, భద్రతా ప్రయోజనాలను కాపాడటంలో చైనా ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.






















