Nani: మనల్ని ఎవడ్రా ఆపేది? - పవర్ స్టార్ డైలాగ్‌తో నేచురల్ స్టార్.. రాజమౌళి 'SSMB29'తో 'హిట్ 3' లింక్ పెట్టేశారుగా..
HIT 3: నేచురల్ స్టార్ నాని నోటి నుంచి పవర్ స్టార్ పవన్ డైలాగ్ రావడంతో ఫ్యాన్స్ కేకలతో స్టేడియం దద్దరిల్లింది. 'హిట్ 3' ప్రీ రిలీజ్ వేడుకలో 'మనల్ని ఎవడ్రా ఆపేది' అంటూ ఆయన జోష్ నింపారు.

Nani Josh With Pawan Dialogue In HIT 3 Pre Release Event: నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో అవెయిటెడ్ మూవీ 'హిట్ 3' (HIT 3) మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించగా.. దర్శక ధీరుడు రాజమౌళి దంపతులు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పవర్ స్టార్ పవన్ డైలాగ్‌తో నేచురల్ స్టార్ నాని స్పీచ్ అదరగొట్టారు.
మనల్ని ఎవడ్రా ఆపేది?
'హిట్ 3' మీద చాలా గట్టి నమ్మకం ఉందని.. కచ్చితంగా హిట్ కొడతామని మూవీ కచ్చితంగా అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అవుతుందని నాని ధీమా వ్యక్తం చేశారు. 'నా వెనుక రాజమౌళి గారు ఉన్నారు. నా ముందు మీరున్నారు. మైండ్‌లో హిట్ 3 హిట్ అని ఫిక్స్ అయిపోయాను. మీ అందరి ప్రేమ నాతోనే ఉంది. కడుపులో ఏడుకొండల వెంకటేశ్వరుని ప్రసాదం ఉంది. మనల్ని ఎవడ్రా ఆపేది.' అంటూ పవన్ డైలాగ్‌తో అదరగొట్టారు నాని. దీంతో స్టేడియం మొత్తం ఫ్యాన్స్ ఈలలు, కేకలతో దద్దరిల్లింది. ఎప్పుడూ తన డైలాగ్సే వాడే నేచురల్ స్టార్ ఇప్పుడు పవర్ స్టార్ డైలాగ్ వాడడంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు.
Manalni evadra apedhiii
— 𝙊𝙓𝙓𝙔🚩🦅 (@Oxxy_7) April 27, 2025
-Says Actor Nani In Pawan Kalyan’s Style 🔥#Pawankalyan #HIT3FromMay1st #Nani pic.twitter.com/g3cgRCmMaR
SSMB29 కు లింక్ పెట్టేశారుగా..
గతంలో కోర్ట్ మూవీ నచ్చకుంటే నా 'హిట్ 3' మూవీ చూడొద్దని చెప్పానని.. ఇప్పుడు 'హిట్ 3' నచ్చకుంటే మహేష్ 'SSMB29'.. అంటూ సరదాగా కామెంట్ చేశారు నాని. ఈ సినిమాను తాకట్టు పెట్టినా ఎవరూ పట్టించుకోరని.. ఎందుకంటే.. రాజమౌళి సినిమా అంటేనే ప్రపంచమంతా తప్పకుండా చూడాల్సిందేనని అన్నారు. 'హిట్ 3లో థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు. కానీ వాళ్ల గురించి సక్సెస్ మీట్‌లో మాత్రమే మాట్లాడగలను. కోర్డ్ నచ్చకుంటే హిట్ 3 చూడొద్దని చెప్పాను. నా జడ్జ్‌మెంట్ నిజమైంది. ఇప్పుడు వేరే నిర్మాత కాబట్టి నేను తాకట్టు పెట్టలేను. థియేటర్లను మళ్లీ కళకళలాడించేలా హిట్ 3 ఉంటుంది. కచ్చితంగా హిట్ కొడుతున్నాం.' అని తెలిపారు.
రాజమౌళి పాస్ పోర్ట్ లాక్కుంటా..
తన సినిమా విడుదలైన ఫస్ట్ డే ప్రసాద్ ఐమాక్స్‌లో రాజమౌళి తన కుటుంబంతో కనిపిస్తే తనకొక ఆనందమని నాని అన్నారు. ఆయన ఏ స్క్రీన్‌లో ఉన్నారో కనుక్కొని.. తాను ఆ డోర్ దగ్గరి నుంచొని వాళ్లు సినిమాను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో గమనిస్తుంటానని తెలిపారు. 'రాజమౌళి మెసేజ్ పెడతా అన్నారంటే ఆ మూవీ హిట్ అయినట్టే లెక్క. ఈ సారి ఎన్ని పనులున్నా ఆయన 'హిట్ 3' చూడాలని కోరుతున్నా. అవసరమైతే అంత వరకూ నేను తన పాస్ పోర్ట్ లాక్కుంటా. రాజమౌళి ఈ వేడుకకు వచ్చారు కాబట్టి కచ్చితంగా మే 1న బ్లాక్ బస్టర్ కొడుతున్నాం.' అని అన్నారు.





















