Hit 3: 'హిట్ 3'లో హీరోయిన్‌తో అడివి శేష్ ఫైట్... చివరి అరగంటలో బోలెడు సర్‌ప్రైజ్‌లు!
Hit 3 First Review: హిట్ 3 సినిమా గురించి యంగ్ హీరో అడివి శేష్, యాక్షన్ కొరియోగ్రాఫర్ కొన్ని లీక్స్ ఇచ్చారు. క్లైమాక్స్ గురించి ఆయన చెప్పిన మాటలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయని చెప్పవచ్చు.

'హిట్ 3' (Hit 3 Release Date) విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు అంచనాలు పెంచాయి. నేచురల్ స్టార్ నాని ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ మీద ఇంత వయలెంట్ రోల్ చేయలేదు. దాంతో సినిమా ఎలా ఉంటుందో? అనే ఆసక్తి నాని అభిమానులతో పాటు ప్రేక్షకులలోనూ ఉంది. ట్రైలర్, పాటల్లో నాని క్యారెక్టర్ మాత్రమే హైలైట్ అయ్యింది. సినిమాలో ఆయన యాక్షన్ ఒక రేంజ్‌లో చేశారని అర్థం అవుతోంది. అయితే ఆయనతో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా ఫైట్ చేశారట.
శ్రీనిధి శెట్టితో అడవి శేష్ ఫైట్!
సర్కార్ పార్టీ పేరుతో శనివారం రాత్రి హైదరాబాద్ సిటీలో 'హిట్ 3' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Hit 3 pre release event) నిర్వహించారు. ఆ కార్యక్రమంలో సినిమా యాక్షన్ కొరియోగ్రాఫర్ సతీష్ శ్రీనిధి శెట్టి ఫైట్ చేసిన విషయాన్ని లీక్ చేశారు.
Also Read: 'హిట్ 3'లో శ్రీనిధి శెట్టి ఒక్కరే కాదు... ఈ బ్యూటీ కూడా ఉందండోయ్
Leaks from the Action Choreographer Sathish.#HIT3 pic.twitter.com/B9g1YFpIvZ
— Gulte (@GulteOfficial) April 27, 2025
అవును... మీరు పైన వీడియోలో విన్నది, చదివింది నిజమే! 'హిట్ 3' సినిమాలో శ్రీనిధి శెట్టి ఫైట్ చేశారని స్టంట్ మాస్టర్ సతీష్ చెప్పారు. మరి, ఆ ఫైట్ ఎవరితోనో తెలుసా? యాంకర్ సుమ గనుక అడ్డు పడకుండా ఉంటే అది కూడా సతీష్ చెప్పేసేవారు. అఫ్ కోర్స్ అప్పటికి ఒక హిట్ ఇచ్చారు. శ్రీనిధి శెట్టి - అడవి శేష్ మధ్య ఫైట్ ఉంటుందని! అది ఎలా ఉంటుందో మే ఒకటవ తేదీన థియేటర్లలో తెలుస్తుంది.
Watched #HIT3 last 30 minutes. It's going to be stunning and has lot of surprises.
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) April 27, 2025
- #AdiviSesh
pic.twitter.com/TXqu8KIrvD
క్లైమాక్స్ అర గంటలో ఎన్నెన్నో!
'హిట్ 3' సినిమాలో అడవి శేష్ నటించిన విషయాన్ని చిత్ర బృందం ఎప్పుడో వెల్లడించింది. 'హిట్ 2'లో ఆయన చేసిన క్యారెక్టర్ ఈ సినిమాలో కూడా కంటిన్యూ అవుతుంది. సర్కార్ పార్టీకి అడవి శేష్ అటెండ్ అయ్యారు. 'హిట్ 3' క్లైమాక్స్ అర గంటలో బోలెడు సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చెప్పారు. బహుశా శ్రీనిధి శెట్టితో ఆయన చేసిన ఫైట్ చివరి అరగంటలో వస్తుందేమో!? అందులో హీరో నాని కూడా ఎంట్రీ ఇస్తారేమో!?
Also Read: మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో మే 1న భారీ ఎత్తున 'హిట్ 3' సినిమా థియేటర్లలోకి రానుంది. నాని బ్రాడ్ ఇమేజ్‌కు తోడు వయలెంట్ ట్రైలర్ సినిమాకు బజ్ తీసుకు వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే మొదటి రోజు 'హిట్ 3' భారీ రికార్డులు సాధించవచ్చని అర్థం అవుతోంది. ఆ రోజు థియేటర్లలో విడుదల కానున్న సూర్య 'రెట్రో', అజయ్ దేవగణ్ 'రైడ్ 2' సినిమాల కంటే దీనికే తెలుగు నాట ఎక్కువ క్రేజ్ నెలకొంది.



















