అన్వేషించండి
Advertisement
Medchal News: మేడ్చల్ సిఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత- బాత్రూంలో వీడియోలు తీశారని ధర్నా
Medchal Crime News: అమ్మాయిల బాత్రూంలో వీడియోలు షూట్ చేశారని మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీ విద్యార్థులు ఆందోళనబాటపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Medchal Girl Students Protest: హైదరాబాద్ శివారులోని మేడ్చల్ వద్ద CMRIT గర్ల్స్ హాస్టల్ వద్ద అమ్మాయిలు ధర్నా చేపట్టారు. బాత్రూంలో విద్యార్థులు ఉండగా సిబ్బంది వీడియోలు తీసారని ఆరోపించారు. కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
జోక్యం చేసుకున్న మేడ్చల్ పోలీసులు సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్దకు వచ్చి విచారణ చేపట్టారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు హాస్టల్‌లో వంట చేసే వారై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు స్టూడెంట్ యూనియన్‌లు బాసటగా నిలిచారు. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడకు చేరుకొని ధర్నా చేయడంతో యంత్రాంగం స్పందించింది. నలుగురు ఆకతాయిలను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అనుమానితులను అరెస్టు చేయడంతో విద్యార్థినులు ధర్నా విరమించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విజయవాడ
ఇండియా
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion