అన్వేషించండి

Telangana: మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్

Telangana PAC: పీఏసీ ఛైర్మన్‌గా గాంధీని నియామకంపై మరోసారి రగడ చెలరేగింది. తొలిసారిగా భేటీన పీఏసీ సమావేశాన్ని బీఆర్‌ఎస్ నేతలు వాకౌట్ చేశారు.

Telangana News: తెలంగాణలో ఇవాళ తొలిసారిగా పీఏసీ సమావేశమైంది. అరికెపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులతోపాటు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కాసేపటికే బీఆర్‌ఎస్ నేతలు మంత్రులతో వాగ్వాదానికి దిగారు. అర్హత లేని గాంధీకి పీఏసీ ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు నిరసనగా తాము సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 

ఉదయం 11 గంటల తర్వాత సమావేశమైన ప్రజాపద్దుల కమిటీ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబుతోపాటు సభ్యులైన ప్రశాంత్ రెడ్డి, రావూరి ప్రకాశ్‌ రెడ్డి, వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, గంగుల కమలాకర్, రామ్‌రావు పవార్, అహ్మద్‌ బిన్న అబ్దుల్లా బలాల,కూనంనేని సాంబశివరావు సహా ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, బానుప్రసాద్‌రావు, జీవన్ రెడ్డి, ఎల్ రమణ హాజరయ్యారు. 

అసెంబ్లీ కమిటీలో హాల్‌లో జరిగిన సమావేశం ప్రారంభమైన కొత్తిసేపటికి వివాదం మొదలైంది. అరికెపూడి గాంధీని పీఏసీ ఛైర్న్‌గా నియమించడంపై బీఆర్‌ఎస్ సభ్యులు నిలదీశారు. ఎంపిక తీరు సరిగా లేదని వాగ్వాదానికి దిగారు. ఈ నియామకంలో కక్షపూరితంగా వ్యవహరించారని అందుకే ఈ భేటీని బహిష్కరిస్తున్నట్టు ప్రశాంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎవర్నీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణం తీసుకున్నట్టు వెల్లడించారు. 

ఏంటీ ప్రజాపద్దుల కమిటీ
రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరును, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా కొన్ని కమిటీలు ఉంటాయి. వాటిలో ఒకటే ఈ ప్రజాపద్దుల కమిటీ. ఇందులో 9 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఛైర్మన్‌ పదవి మాత్రం ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన పార్టీకి లభిస్తుంది. సభ్యుల సంఖ్య కూడా ఆయా పార్టీల సంఖ్యాబలం బట్టి కేటాయిస్తారు. 
 ఇక్కడే వివాదం నెలకొంది. అధికారంగా కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తికి పీఏసీ ఛైర్మన్ ఇవ్వడంపై బీఆర్సీ మండిపడింది. ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర పదజాలంతో పార్టీ మారిన వ్యక్తులను టార్గెట్ చేశారు. దీంతో రెండు రోజుల పాటు మెదక్ అంతా అల్లాడిపోయింది. 

Also Read: మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
GTA 6: జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Embed widget