By: ABP Desam | Updated at : 31 Jan 2023 07:21 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Pixabay
ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే టాప్ 10 యాప్స్ లో వాట్సాప్ ఒకటి. ఆఫీస్ పనులైన వ్యక్తిగత పనులైనా వాట్సాప్ నుంచే చక్కబెట్టుకునే పరిస్థితి నెలకొంది. చాలా మంది వాట్సాప్ గ్రూపులు, కమ్యూనిటీలను ఉపయోగిస్తారు. వాట్సాప్ కొద్ది కాలం కిందటే కమ్యూనిటీస్ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ తో యూజర్లు 20 గ్రూపులను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో గానీ, ఫ్యామిలీలో గానీ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి వాటన్నింటిని ఒకే చోటుకు చేర్చి కమ్యూనిటీగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ విడుదలైన తర్వాత చాలా మంది యూజర్లకు గ్రూప్, కమ్యూనిటీ మధ్య తేడా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్, తోటి ఉద్యోగులు కలిసి తమ అభిప్రాయాలను పంచుకునేందుకు గ్రూప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే సారి తాము చెప్పాలనుకున్న విషయం గ్రూపులోని అందరికీ చేరుతుంది. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా, అందరికీ ఒకేసారి చెప్పే వీలుంటుంది. ఒక్కో గ్రూపులో 1,024 మంది సభ్యులను చేర్చే అవకాశం ఉంటుంది. గ్రూపులో చాట్ కు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ సైతం ఉంటుంది. ఇన్వైట్ లింక్, క్యూఆర్ కోడ్ స్కాన్, లేదంటే అడ్మిన్ పర్మిషన్ తో గ్రూపులో మెంబర్ గా చేరే అవకాశం ఉంటుంది.
Welcome to Communities 👋
Now admins can bring related groups together in one place to keep conversations organized.
Organized. Private. Connected 🤝 pic.twitter.com/u7ZSmrs7Ys — WhatsApp (@WhatsApp) November 3, 2022
బంధు మిత్రులు, కాలేజీ, ఆఫీస్ మిత్రులంతా కలిసి గ్రూపులుగా ఏర్పాటు చేసుకుంటారు. వాటిలో ఏదైనా సమాచారం పంచుకోవాలంటే ప్రతి గ్రూపును సెలక్ట్ చేసి పంపాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకేసారి పలు గ్రూపులకు మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో కమ్యూనిటీలను పరిచయం చేసింది వాట్సాప్. 20 గ్రూపులను కలిపి ఒక కమ్యూనిటీగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ కమ్యూనిటీ అడ్మిన్ ఏదైనా విషయాన్ని షేర్ చేస్తే 20 గ్రూపుల్లోని సభ్యులందరికీ తెలుస్తుంది. ఈ ఫీచర్ మూలంగా ఒకేసారి ఎక్కువ మందికి సమాచారాన్ని సులువుగా షేర్ చేసే అవకాశం ఉంటుంది. గ్రూప్స్ మాదిరిగానే కమ్యూనిటీస్ లోనూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ ఉంటుంది. ఒక గ్రూప్ లోని సభ్యులు మరొక గ్రూప్ సభ్యులతో మాట్లాడాలా? వద్దా? అనేది కూడా కమ్యూనిటీస్ అడ్మిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
The difference between Communities and groups, explained 👇 pic.twitter.com/86MbKtY9Nv
— WhatsApp (@WhatsApp) November 10, 2022
1. WhatsAppలో చాట్‌ల జాబితా పైన ఉన్న మెనూని ఎంచుకోండి. కొత్త చాట్ ఐకాప్ పై క్లిక్ చేయండి.
2. కమ్యూనిటీ పేరు, వివరణ రాయాలి. ప్రొఫైల్ ఫోటో సెట్ చేయాలి. కమ్యూనిటీ పేరు 24 అక్షరాలకు మించి ఉండకూడదు. మీ కమ్యూనిటీ దేనికి సంబంధించినదో వివరణలో చెప్పాలి.
3. కొత్త కమ్యూనిటీ తయారు చేయడానికి లేదంటే ఇప్పటికే ఉన్నదాన్ని జోడించడానికి, గ్రీన్ యారో చిహ్నాన్ని క్లిక్ చేయాలి.
4. ఇక మీ కమ్యూనిటీకి గ్రూపులను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న గ్రూప్ ను జోడించుకోవచ్చు. లేదంటే కొత్త గ్రూప్ ను సృష్టించుకోవచ్చు.
5. మీరు మీ గ్రూపులను యాడ్ చేయడం పూర్తి చేసిన తర్వాత గ్రీన్ చెక్ మార్క్ ను క్లిక్ చేయండి. కమ్యూనిటీ క్రియేట్ అవుతుంది.
Read Also: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?
C12 Budget Smartphone: నోకియా నుంచి రూ.6 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్, ఫీచర్లు కూడా అదుర్స్
iPhone 15 Pro Max: యాపిల్ కొత్త సిరీస్లో సూపర్ ఫీచర్ - శాంసంగ్, షావోమీ ఫోన్లను మించేలా?
Second Hand Smartphone: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!
Samsung Galaxy A54 5G: సూపర్ కెమెరాలతో 5జీ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంతంటే?
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్లో 5388 'నైట్ వాచ్మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం