India U19 team: కుర్రాళ్లకు రోహిత్ పాఠాలు..! జోరు మీదున్న కొత్త కెప్టెన్!
రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. యువ క్రికెటర్లకు విలువైన సూచనలు, పాఠాలు చెబుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు నేర్చుకోవాల్సిన నైపుణ్యాల గురించి వివరిస్తున్నాడు.
టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. యువ క్రికెటర్లకు విలువైన సూచనలు, పాఠాలు చెబుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు నేర్చుకోవాల్సిన నైపుణ్యాల గురించి వివరిస్తున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో అతడు అండర్-19 క్రికెటర్లతో ప్రత్యేకంగా సంభాషించాడు.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్ శర్మ గాయపడ్డాడు. పిక్క కండరాలు పట్టేయడంతో మూడు టెస్టుల సిరీసుకు పూర్తిగా దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకొనేందుకు బెంగళూరులోని ఎన్‌సీఏకు వచ్చాడు. ఇదే సమయంలో అక్కడ అండర్-19 క్రికెటర్లకు సన్నాహక శిబిరం జరుగుతోంది. సమయం కుదరడంతో ఎన్‌సీఏ పెద్దలు కుర్రాళ్లకు రోహిత్‌తో మాట్లాడే అవకాశం కల్పించారు.
Priceless lessons 👍 👍
— BCCI (@BCCI) December 17, 2021
📸 📸 #TeamIndia white-ball captain @ImRo45 made most of his rehab time as he addressed India’s U19 team during their preparatory camp at the NCA in Bengaluru. pic.twitter.com/TGfVVPeOli
అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడిని ఎదుర్కోవడం, సవాళ్లను ఎలా పరిష్కరించుకోవాలి, జాతీయ జట్టుకు ఆడాలంటే ఏం చేయాలి వంటి వివరాలను రోహిత్ కుర్రాళ్లతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం హిట్‌మ్యాన్ గాయం కాస్త కుదురుకున్నట్టే కనిపిస్తోంది. అతడు దూరమవ్వడంతో యువ క్రికెటర్ ప్రియాంక్ పంచాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Year Ender 2021: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021
Also Read: David Warner: మనసులు గెలిచిన వార్నర్.. ఏం చేశాడంటే?
Also Read: Ganguly on Virat Kohli: 'బోత్ ఆర్ నాట్ సేమ్..!' గంగూలీ వద్ద కోహ్లీ తప్పని నిరూపించే సాక్ష్యాలు?
Also Read: Kohli vs Ganguly: వేర్వేరు మాటలెందుకో? ఆ సంగతి గంగూలీనే అడగాలన్న సన్నీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి