Kohli vs Ganguly: వేర్వేరు మాటలెందుకో? ఆ సంగతి గంగూలీనే అడగాలన్న సన్నీ
విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మాటల్లో విరుద్ధభావాలు కనిపిస్తున్నాయని సునిల్ గావస్కర్ అన్నాడు. విరాట్ వన్డే కెప్టెన్సీ వ్యవహారాన్ని సమర్థంగా నిర్వహించుంటే బాగుండేదని పేర్కొన్నాడు.
టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాటల్లో విరుద్ధభావాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ సునిల్ గావస్కర్ అన్నాడు. విరాట్ వన్డే కెప్టెన్సీ వ్యవహారాన్ని సమర్థంగా నిర్వహించుంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై బీసీసీఐ స్పష్టతనివ్వాలని సూచించాడు. ఆటగాళ్లు, సెలక్షన్ కమిటీ, బీసీసీఐ మధ్య కమ్యూనికేషన్ బాగుండాలని వివరించాడు.
'కోహ్లీ మాట్లాడిన విధానం ప్రకారం బీసీసీఐ పైనే పూర్తిగా వేలెత్తి చూపలేం! అయితే అతడికి సందేశం వ్యక్తిగతంగా వచ్చి ఉండొచ్చు. అలాంటి భావంతో పరోక్షంగా చెప్పారేమో! ఏదేమైనా అతడు బీసీసీఐ అధ్యక్షుడు. భిన్నంగా ఎందుకు మాట్లాడారో అతడిని అడగాల్సిందే. టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు ఏం చెప్పారో అతడిని అడిగితేనే తెలుస్తుంది' అని గావస్కర్ అన్నాడు.
#EJSports | #ViratKohli's fiery press conference in Mumbai. Says he wasn't contacted in time before ODI captaincy snub & speaks at length about his 'alleged fight' with #RohitSharma @imVkohli @ImRo45 @BCCI pic.twitter.com/ZhsjSf9uSz
— editorji (@editorji) December 15, 2021
బీసీసీఐలో కమ్యూనికేషన్ విధానం బాగుపడాలని గావస్కర్ సూచించారు. విరాట్ ఎత్తిచూపిన అంశంతో ఏకీభవించాడు. 'అవును, స్పష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటే అంతా బాగుంటుంది. అప్పుడు వదంతులకు ఆస్కారం ఉండదు. ఇప్పుడిలా జరగడానికి కారణమూ భావ ప్రసార లోపమే! ఒక ఆటగాడిని ఎందుకు ఎంచుకున్నారో, ఎందుకు ఎంచుకోవడం లేదో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ముందుకొచ్చి చెప్పాలి. కొన్నిసార్లు అలాంటి అవసరం లేదనిపిస్తే కనీసం మీడియాలో ఓ ప్రకటనైనా చేస్తే మంచిది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులూ రావు' అని సన్నీ తెలిపాడు.
'ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాకు తెలియదు. సెలక్షన్ కమిటీ ఛైర్మన్, అతడి (కోహ్లీ)కి మధ్య కమ్యూనికేషన్ బాగుంటే మంచిదే కదా. ఇక వాళ్లేం మాట్లాడుకున్నారో నాకైతే అవగాహన లేదు. బహుశా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అతడికి ధన్యవాదాలు చెప్పిఉంటాడు' అని సన్నీ ముగించాడు.
Also Read: Kohli Post on Dhoni: ధోనీ అంటేనే కింగ్! కోహ్లీ చేసిన ఈ ట్వీటే నంబర్ వన్!
Also Read: BBL: ప్చ్.. అయ్యయ్యో.. క్యాచ్ పట్టబోయిన అభిమాని తల పగిలింది.. రక్తం వస్తుందని అతడికే తెలియలేదు
Also Read: Kohli Press Conference: 'రోహిత్‌కు నాకు మధ్య విభేదాల్లేవు..' కెప్టెన్సీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్
Also Read: Ravindra Jadeja Test Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో జడ్డూ..???
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి