BBL: ప్చ్.. అయ్యయ్యో.. క్యాచ్ పట్టబోయిన అభిమాని తల పగిలింది.. రక్తం వస్తుందని అతడికే తెలియలేదు
ఓ క్రికెట్ అభిమాని.. బ్యాట్స్ మెన్ కొట్టిన సిక్స్ ను క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. అది మిస్ అయి అతడి తలకు గాయమై.. రక్తం వచ్చింది.
ఆస్ట్రేలియాలోని హోబర్ట్ లో బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) మ్యాచ్ జరుగుతుంది. ఇందులో హోబర్ట్ హరికేన్స్ మరియు పెర్త్ స్కార్చర్స్ నడుమ జరుగుతున్న మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ కొట్టిన సిక్స్ ప్రేక్షకుల మధ్యకు వచ్చింది. అయితే ఓ క్రికెట్ అభిమాని బాల్ ను క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అది మిస్ అయి అతడి తలకు గాయమైంది.
హరికేన్స్ బ్యాటర్ బెన్ మెక్‌డెర్మాట్ ఎనిమిదో ఓవర్ మెుదటి బంతికి సిక్సర్ కొట్టాడు. అయితే ప్రేక్షకుల గుంపులో ఉన్న యువకుడు క్యాచ్‌ను పట్టేందుకు ప్రయత్నించాడు. కానీ దానిని పట్టుకోలేకపోయాడు. బంతి అతని నుదిటికి బలంగా తాకింది. కింద పడిన యువకుడు అతడి ముఖాన్ని పట్టుకున్నాడు. అంతా ఏం కాలేదు అనుకున్నారు. రక్త వస్తున్నట్టు అతడికి కూడా తెలియలేదు.
Lucky the fan on the hill is OK...
— 7Cricket (@7Cricket) December 14, 2021
Because his missed catch has drawn blood 😳#BBL11 pic.twitter.com/X0MTmDp7a2
క్రికెట్ కామెంట్రీలో యువకుడు క్యాచ్‌ను ఎలా వదిలాడనే దాని గురించి మాట్లాడుతున్నారు. కింద నుంచి లేచిన అతడికి రక్తం రావడం మెుదలైంది. వెంటనే స్పందించిన ప్రేక్షకులు వైద్య సాయం కోసం అతడిని తరలించారు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
బిగ్ బాష్ లీగ్ లో హరికేన్స్ 19 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. స్కార్చర్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కార్చర్స్ టీమ్ 182/5 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 50 బంతుల్లో సెంచరీ చేసి 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాట్స్ మెన్స్ విఫలమైనప్పటికీ మార్ష్ ఒంటరిగా ఆదుకున్నాడు. లారీ ఎవాన్స్ 24 బంతుల్లో 40 నాటౌట్ గా నిలిచాడు.
హరికేన్స్ టీమ్ లో డీ ఆర్సీ షార్ట్ 31, మెక్‌డెర్మాట్ 41 పరుగులు చేశారు. ఇతర బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు.
Also Read: Kohli Vs Rohit: ఒకళ్లుంటే మరొకళ్లు ఆడరా... ఇలా అయితే టీమిండియాకు కష్టమే!
Also Read: Virat Kohli: వన్డే సిరీస్ నుంచి కోహ్లీ అవుట్? కారణం అదే!
Also Read: TOPS Athletes: ‘టాప్స్’ జాబితాలో ఆరుగురు తెలంగాణ అథ్లెట్లు.. ఎవరికి దక్కిందంటే?