Kohli Press Conference: 'రోహిత్‌కు నాకు మధ్య విభేదాల్లేవు..' కెప్టెన్సీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు.
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ తొలిగింపుపై కీలక కామెంట్లు చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటున్నట్లు స్పష్టం చేశాడు.
Will miss Rohit Sharma's abilities a lot during Test series against South Africa: Kohli
— Press Trust of India (@PTI_News) December 15, 2021
విభేదాల్లేవు..
No problem between me and Rohit, have been clarifying for two years. I am tired now: Kohli
— Press Trust of India (@PTI_News) December 15, 2021
రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలపై కూడా కోహ్లీ స్పందించాడు. తనకు రోహిత్‌కు మధ్య ఎలాంటి విభేదాల్లేవని పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని గత రెండేళ్లుగా చెప్పిచెప్పి అలసిపోయానని కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు.
ఇటీవల పరిణామాలు..
విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌లో ఆడబోవడం లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. జనవరిలో వ్యక్తిగత కారణాల కారణంగా తనకు బ్రేక్ కావాలని విరాట్ కోరినట్లు ఇలా రకరకాల కథనాలు వినిపించాయి. వీటన్నింటినీ విరాట్ కోహ్లీ ఖండించాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డేలకు, టీ20లకు కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ నుంచి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఇప్పుడు తనకు గాయం కావడంతో టెస్టు సిరీస్‌కు దూరం అయినట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికా టూర్‌కు వన్డే జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో ఎంతో మంది యువ ఆటగాళ్లు మెరుగ్గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఈసారి వారికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
వీరిలో కొంతమందికి దక్షిణాఫ్రికా టూర్‌లో అవకాశం రావచ్చని తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ స్థానంలో గుజరాతీ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్‌ను జట్టుకు ఎంపిక చేశారు. రోహిత్ ఈ టెస్టు సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా కూడా నియమితుడయ్యాడు. మరి ఆ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో కూడా తెలియాల్సి ఉంది.
Also Read: Ganguly on IPL 2022:: ఒమిక్రాన్‌పై గంగూలీ కామెంట్స్..! వచ్చే ఐపీఎల్‌ను...?
Also Read: Rohit Sharma Update: బయటి మాటల్ని పట్టించుకోం.. బలమైన బంధమే ముఖ్యమన్న రోహిత్
Also Read: India's Tour Of South Africa: ఈ నలుగురూ ఆడితే దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్‌కు తిరుగులేదు.. ఎవరంటే?
Also Read: Pushpa Event: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి