Ganguly on IPL 2022:: ఒమిక్రాన్‌పై గంగూలీ కామెంట్స్..! వచ్చే ఐపీఎల్‌ను...?
ఐపీఎల్ తర్వాతి సీజన్ గురించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడాడు. భారత్‌లోనే ఐపీఎల్ తర్వాతి సీజన్ నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కరోనా ఘోర దశ ముగిసిందనే భావిస్తున్నామని తెలిపాడు.
కరోనా ఘోర దశ ముగిసిందనే భావిస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అంటున్నాడు. భారత్‌లోనే ఐపీఎల్ తర్వాతి సీజన్ నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అంతర్జాతీయంగా క్రికెట్ కొనసాగుతోందని వెల్లడించాడు. తాజా ఒమిక్రాన్ వేరియెంట్ గురించి అంతగా ఆందోళన చెందడం లేదని పేర్కొన్నాడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ ఐపీఎల్ సీజన్‌ను మొదట భారత్‌లోనే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. సగం సీజన్ ముగిసిన తర్వాత ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకడంతో నిరవధికంగా వాయిదా వేశారు. సెప్టెంబర్లో దుబాయ్‌లో రెండో అంచె నిర్వహించారు. ఆ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నూ బీసీసీఐ అక్కడే నిర్వహించింది. ఈ మధ్యే స్వదేశంలో న్యూజిలాండ్ సిరీసుకు బీసీసీఐ ఆతిథ్యం ఇచ్చింది. కరోనా ఘోర దశ అంతమైందనే బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
'కరోనా ఘోర దశ ముగిసిందనే అనుకుంటున్నా! వచ్చే ఐపీఎల్ సీజన్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని నమ్మకంగా ఉన్నా. ఎందుకంటే ఇది మన దేశపు టోర్నీ. ఐపీఎల్ ఇక్కడ ఆడుతున్నప్పుడు వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఇప్పుడైతే అంతర్జాతీయ క్రికెట్ జరుగుతోంది. మేం న్యూజిలాండ్ సిరీసుకు ఆతిథ్యమిచ్చాం. త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నాం. ఆ తర్వాత వెస్టిండీస్, శ్రీలంక సిరీసులు ఉన్నాయి. అందుకే ఘోర దశ ముగిసిందని అనుకుంటున్నా' అని దాదా అన్నాడు.
'కొవిడ్ ఉన్నప్పటికీ మేం ఐపీఎల్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. దుబాయ్‌లోని క్రీడా వర్గాలు అద్భుతంగా పనిచేశాయి. ఇప్పుడు మన దేశవాళీ క్రికెట్ మునుపటి స్థాయిలోనే కొనసాగుతోంది. మహమ్మారి వల్ల గతేడాది కాస్త విరామం ఇవ్వాల్సి వచ్చింది. దాదాపు మేం అన్ని టోర్నీలను పూర్తి చేశాం. జనవరిలో రంజీ ట్రోఫీ మొదలవుతుంది. జూనియర్ క్రికెట్ సైతం ఆరంభమైంది. ఇప్పటికైతే కొవిడ్ పాజిటివ్ కేసులు లేవు' అని గంగూలీ తెలిపాడు.
కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ ప్రభావం గురించి ప్రశ్నించగా ఆందోళన చెందడం లేదని సౌరవ్ అన్నాడు. 'మేం భయపడటం లేదు. మున్ముందు పరిస్థితులను సమీక్షించి ఏం జరుగుతుందో చూస్తాం' అని వెల్లడించాడు.
Also Read: Virat Kohli: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!
Also Read: Ashes 2021-22: అదరగొట్టిన ఆస్ట్రేలియా.. యాషెస్‌లో మొదటి విజయం
Also Read: Warner Pushpa Video: పుష్పగా మారిన వార్నర్.. కోహ్లీ కామెంట్ చూస్తే నవ్వాగదు!
Also Read: CSK KKR Retentions 2022: చావుదెబ్బ కొట్టారు కదయ్యా.. చెన్నై, కోల్‌కతా నిర్ణయాల వెనక పెద్ద స్కెచ్!
Also Read: Ruturaj Gaikwad: ఎప్పుడో ఐపీఎల్‌లో మ్యూజిక్ స్టార్ట్ చేశాడు.. ఇంకా ఆపలా.. రుతురాజ్ మరో రికార్డు