అన్వేషించండి

Ashes 2021-22: అదరగొట్టిన ఆస్ట్రేలియా.. యాషెస్‌లో మొదటి విజయం

యాషెస్ సిరీస్ మొదటి టెస్టులో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చూపించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 147 పరుగులకే ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ జోస్ బట్లర్ (39: 58 బంతుల్లో, ఐదు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఐదు వికెట్లు దక్కగా.. స్టార్క్, హజిల్‌వుడ్ రెండేసి వికెట్లు తీశారు. కామెరాన్ గ్రీన్‌కు ఒక వికెట్ దక్కింది. మొత్తం 10 వికెట్లూ పేసర్లకే దక్కడం విశేషం.

ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 425 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు 278 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ట్రావిస్ హెడ్ (152: 148 బంతుల్లో, 14 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, డేవిడ్ వార్నర్ (94: 176 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లు), మార్నస్ లబుషగ్నే (74: 117 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) రాణించారు. ట్రావిస్ హెడ్ అయితే వన్డే తరహాలో 100కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్ మూడేసి వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్ రెండు వికెట్లు సాధించాడు. జాక్ లీచ్, జో రూట్‌లకు చెరో వికెట్ దక్కింది.

278 పరుగుల భారీ లోటుతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. డేవిడ్ మలన్ (82: 195 బంతుల్లో, 10 ఫోర్లు), జో రూట్ (89: 165 బంతుల్లో, 10 ఫోర్లు) రాణించడంతో ఒక దశలో 223-2 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. అయితే ఆ తర్వాత 74 పరుగుల వ్యవధిలోనే మిగతా వికెట్లన్నీ కోల్పోయి 297 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియోన్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. కామెరాన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్‌లు రెండేసి వికెట్లు, మిషెల్ స్టార్క్, జోష్ హజిల్‌వుడ్ చెరో వికెట్ తీశారు.

20 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా యాషెస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. డిసెంబర్ 16వ తేదీ నుంచి అడిలైడ్ ఓవల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

Also Read: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!

 

Also Read: ICC Test Rankings: మయాంక్‌ దూకుడు..! 10 వికెట్ల అజాజ్‌ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!

Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?

Also Read: Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ఆ స్టార్ ఆటగాడు దూరం.. వీరిద్దరికీ లక్కీ చాన్స్!

Also Read: Rahul Dravid: ద్రవిడ్‌ శాసనం..! కుంబ్లే నాటి రూల్‌ కఠినతరం చేసిన వాల్‌.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Best Budget 9 Seater SUV: చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Best Budget 9 Seater SUV: చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Embed widget