IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Virat Kohli: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినందుకు మాజీ క్రికెటర్ మదన్ లాల్ సెలక్టర్లపై విరుచుకుపడ్డారు.

FOLLOW US: 

టీమిండియాలో విరాట్ మంట ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదు. దీనిపై ఫ్యాన్స్, క్రికెట్ విశ్లేషకులు ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉన్నారు. బీసీసీఐ బుధవారం రోహిత్ శర్మను కొత్త వన్డే కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే టెస్టులకు మాత్రం కోహ్లీనే కొనసాగనున్నాడు.

2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ వన్డేలు, టెస్టులకు కెప్టెన్‌గా ఉండాలని కోరుకున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ వరకు అయినా కెప్టెన్‌గా ఉండాలని కోహ్లీ కోరుకున్నాడు. కానీ బీసీసీఐ ప్రణాళికలు మాత్రం వేరుగా ఉండటంతో కోహ్లీకి ఉద్వాసన తప్పలేదు.

ఈ వివాదంపై 1983 వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడైన మదన్ లాల్ కూడా స్పందించారు. విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సెలక్టర్లపై భారీ విమర్శలు గుప్పించారు. కోహ్లీ కెప్టెన్సీలో జట్టు ఎంతో బాగా పెర్ఫార్మ్ చేస్తున్నా మార్చడం మంచిది కాదన్నారు.

కోహ్లీ నేతృత్వంలో సత్ఫలితాలు వస్తున్నప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం దేనికని ప్రశ్నించారు. సెలక్టర్లు దీని గురించి ఆలోచించారో లేదో తెలియడం లేదని తెలిపారు. మిగతా రెండు ఫార్మాట్లపై దృష్టి పెట్టడానికే టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడని అర్థం చేసుకోవచ్చని, కానీ మిగతా రెండు ఫార్మాట్లలో కోహ్లీ విజయవంతంగా కోహ్లీని తొలగించడం, తనని రెచ్చగొట్టడం అవుతుందని అభిప్రాయపడ్డారు.

2023 వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీని వన్డేలకు కెప్టెన్‌గా ఉండనివ్వాల్సింది అన్నారు. ఇప్పటికిప్పుడు జట్టును రూపొందించడం కష్టం కానీ.. దాన్ని నాశనం చేయడం మాత్రం చాలా సులభం అని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ తప్పుకోవడానికి నిరాకరించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపారు.

Also Read: Hardik Pandya Test Retirement: హార్దిక్‌ పాండ్య సంచలన నిర్ణయం.. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు యోచనలో ఆల్‌రౌండర్‌!

Also Read: ICC Test Rankings: మయాంక్‌ దూకుడు..! 10 వికెట్ల అజాజ్‌ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!

Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?

Also Read: Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ఆ స్టార్ ఆటగాడు దూరం.. వీరిద్దరికీ లక్కీ చాన్స్!

Also Read: Rahul Dravid: ద్రవిడ్‌ శాసనం..! కుంబ్లే నాటి రూల్‌ కఠినతరం చేసిన వాల్‌.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!

Also Read: Team India Announced: రోహిత్‌కు ప్రమోషన్.. పరిమిత ఓవర్లకు పూర్తిస్థాయి కెప్టెన్.. కింగ్ కోహ్లీ టెస్టుల వరకే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Dec 2021 09:00 PM (IST) Tags: Virat Kohli Rohit Sharma Virat Kohli Sacked Madan lal Madan lal Slams Selectors

సంబంధిత కథనాలు

IPL 2022: మాంత్రికుడి ప్రాణం చిలకలో! RCB, DC ప్రాణాలు ముంబయి చేతిలో!!

IPL 2022: మాంత్రికుడి ప్రాణం చిలకలో! RCB, DC ప్రాణాలు ముంబయి చేతిలో!!

Virat Kohli: నా జట్టు కోసం ఏం చేయలేకపోయా.. అదొక్కటే బాధ అంటున్న కోహ్లీ

Virat Kohli: నా జట్టు కోసం ఏం చేయలేకపోయా.. అదొక్కటే బాధ అంటున్న కోహ్లీ

Prashant Kishor on Congress: కాంగ్రెస్ సమావేశాలతో అణా పైసా లాభం లేదు- అడిగారు కాబట్టి చెబుతున్నా: పీకే

Prashant Kishor on Congress: కాంగ్రెస్ సమావేశాలతో అణా పైసా లాభం లేదు- అడిగారు కాబట్టి చెబుతున్నా: పీకే

Umbrella Costs 1 Lakh : ఆ గొడుగు ధర అక్షరాలా లక్ష - వర్షంలో బయటకు తీసుకెళ్లారో తడిచిపోతారంతే !

Umbrella Costs 1 Lakh :  ఆ గొడుగు ధర అక్షరాలా లక్ష - వర్షంలో బయటకు తీసుకెళ్లారో తడిచిపోతారంతే !

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!

Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!

Right To Dignity: సెక్స్ వర్కర్స్‌కూ గౌరవంగా బతికే హక్కు ఉంది -అడ్రస్ ఫ్రూఫ్ లేకుండానే ఆధార్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం !

Right To Dignity:  సెక్స్ వర్కర్స్‌కూ గౌరవంగా బతికే హక్కు ఉంది -అడ్రస్ ఫ్రూఫ్ లేకుండానే ఆధార్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం !