అన్వేషించండి

Hardik Pandya Test Retirement: హార్దిక్‌ పాండ్య సంచలన నిర్ణయం.. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు యోచనలో ఆల్‌రౌండర్‌!

టీమ్ఇండియా క్రికెటర్ హార్దిక్‌ పాండ్య సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడని తెలిసింది. సుదీర్ఘ ఫార్మాట్‌కు అతడు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడని సమాచారం.

టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడని తెలిసింది. సుదీర్ఘ ఫార్మాట్‌కు అతడు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడని సమాచారం. వెన్నెముక ఇబ్బందులు, ఫిట్‌నెస్‌ సమస్యలతో అతడు ఇందుకు సిద్ధమయ్యాడని అంటున్నారు. ఏదేమైనా అతడు టెస్టు జట్టు పరిగణనలో లేకపోవడం గమనార్హం!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ పాండ్య చివరి సారి ఆడాడు. టోర్నీ ముగియగానే అతడికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. న్యూజిలాండ్‌ సిరీసుకు ఎంపిక చేయలేదు. చాన్నాళ్లుగా అతడి ఫిట్‌నెస్‌పై గందరగోళం నెలకొంది. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత అతడు మునుపట్లా బౌలింగ్‌ చేయడం లేదు. ఇకపై చేస్తాడో లేదో స్పష్టంగా చెప్పడం లేదు. దాంతో టెస్టు జట్టు ప్రణాళికల్లోంచి అతడిని తొలగించారు.

'కొంత కాలంగా హార్దిక్‌ పాండ్య గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై ఆలోచిస్తున్నట్టు అధికారికంగా మాకైతే చెప్పలేదు. ఒకవేళ అతడు వీడ్కోలు పలికితే తెలుపు బంతి క్రికెట్‌పై దృష్టి సారించొచ్చు. ఏదేమైనా అతడు మా టెస్టు జట్టు ప్రణాళికల్లో లేడు. అతడు గుడ్‌బై చెబితే మాత్రం జట్టుకు లోటే! మేం ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలి' అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌కు తెలిపారు.

'హార్దిక్‌ వయసు 28. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంటే మాత్రం టీమ్‌ఇండియాకు పెద్ద లోటే. భారత్‌కు దొరికిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో అతనొకడు. రాబోయే రెండేళ్లలో ప్రపంచకప్‌లు ఉన్నాయి కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి సేవలు అవసరం. అతడు తిరిగి బౌలింగ్‌ చేయడం చాలా ముఖ్యం' అని బీసీసీఐ అధికారి వెల్లడించారు.

Also Read: IND vs NZ Mumbai Test: ఈ చిత్రం మాటల్లో చెప్పలేనిది! అక్షర్‌, అజాజ్‌, రచిన్‌, జడేజా చిత్రాలు వైరల్‌!

Also Read: Ashwin on Ajaz Patel: 10 వికెట్ల అజాజ్‌ పటేల్‌ను టీమ్‌ఇండియా గౌరవించిన తీరు చూడండి..!

Also Read: Sara Tendulkar: మోడలింగ్‌లోకి సారా తెందూల్కర్‌..! ప్రచారచిత్రం అద్దిరిపోయిందిగా!!

Also Read: Yuvraj Singh Comeback Rumor: యువరాజ్‌ సర్‌ప్రైజ్‌..! సెంకడ్‌ ఇన్నింగ్స్‌పై మళ్లీ ట్వీట్‌

Also Read: Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Also Read: Harbhajan singh: క్రికెట్‌కు భజ్జీ వీడ్కోలు ..! వచ్చే వారం గుడ్‌బై చెప్పేస్తాడట!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan vs Pawan Kalyan: వామ్మో! ఆ మ్యాటర్‌లో చంద్రబాబునే మించిపోయిన పవన్ కళ్యాణ్: వైసీపీ సెటైర్లు
వామ్మో! ఆ మ్యాటర్‌లో చంద్రబాబునే మించిపోయిన పవన్ కళ్యాణ్: వైసీపీ సెటైర్లు
Daaku Mahaaraj Review - డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Daaku Maharaaj Public Talk | Nandamuri Balakrishna స్ర్రీన్ ప్రజెన్స్ మెంటల్ మాస్ | ABP DesamDaaku Maharaaj Movie Review | Nandamuri Balakrishna మరణ మాస్ జాతర | ABP DesamSobhan Babu House Vlog | చిన నందిగామ లో నటభూషణ్  కట్టిన లంకంత ఇల్లు | ABP DesamKondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan vs Pawan Kalyan: వామ్మో! ఆ మ్యాటర్‌లో చంద్రబాబునే మించిపోయిన పవన్ కళ్యాణ్: వైసీపీ సెటైర్లు
వామ్మో! ఆ మ్యాటర్‌లో చంద్రబాబునే మించిపోయిన పవన్ కళ్యాణ్: వైసీపీ సెటైర్లు
Daaku Mahaaraj Review - డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Rythu Bharosa Scheme Guidelines: రైతు భరోసా పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం, తెలుగులోనే ఉత్తర్వులు
రైతు భరోసా పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం, తెలుగులోనే ఉత్తర్వులు
FIR Against Daggubati family: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్, కోర్టు ఆదేశాలతో కేసు నమోదు
దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్, కోర్టు ఆదేశాలతో కేసు నమోదు
Daaku Maharaaj Twitter Review - 'డాకు మహారాజ్' ఆడియన్స్ రివ్యూ: బాలయ్య మాస్‌కు మ్యూజిక్‌తో తమన్ దబిడి దిబిడి - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
'డాకు మహారాజ్' ఆడియన్స్ రివ్యూ: బాలయ్య మాస్‌కు మ్యూజిక్‌తో తమన్ దబిడి దిబిడి - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Embed widget