Ashwin on Ajaz Patel: 10 వికెట్ల అజాజ్ పటేల్‌ను టీమ్‌ఇండియా గౌరవించిన తీరు చూడండి..!
రెండో టెస్టులో అజాజ్ పటేల్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. ఎంతో మంది ప్రయత్నించినా అందుకోని రికార్డును దక్కించుకున్నాడు. అతడికి టీమ్‌ఇండియా క్రికెటర్లు ప్రత్యేకంగా గౌరవించారు.
న్యూజిలాండ్ క్రికెటర్ అజాజ్ పటేల్‌ను టీమ్‌ఇండియా వినూత్నంగా గౌరవించింది. క్రికెటర్లంతా సంతకాలు చేసిన జెర్సీని అతడికి బహూకరించింది. రవిచంద్రన్ అశ్విన్ స్వయంగా అతడిని ఇంటర్వ్యూ చేస్తూ ఈ జెర్సీని బహూకరించాడు.
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీయడమంటే మామూలు విషయం కాదు! చరిత్రలో మొన్నటి వరకు ఈ రికార్డు ఇద్దరి పేరుతోనే ఉండేది. ఇంగ్లాండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ మొట్టమొదటి సారి ఈ ఘనత అందుకున్నాడు. దాదాపుగా 50 ఏళ్ల తర్వాత అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్‌పై 10 వికెట్లు పడగొట్టాడు. మళ్లీ 22 ఏళ్లకు కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఈ రికార్డు సమం చేశాడు.
ముంబయి వేదికగా జరిగిన రెండో టెస్టులో అజాజ్ పటేల్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. ఎంతో మంది ప్రయత్నించినా అందుకోని రికార్డును దక్కించుకున్నాడు. పైగా అతడు భారత సంతతి వ్యక్తి కావడం అదే ముంబయిలో జన్మించడం ప్రత్యేకం. ఈ నేపథ్యంలో అతడికి టీమ్‌ఇండియా క్రికెటర్లు ప్రత్యేకంగా గౌరవించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ అతడిని ఇంటర్వ్యూ చేశాడు.
Special Mumbai connect 👍
— BCCI (@BCCI) December 6, 2021
Secret behind 10-wicket haul 😎
A memorable #TeamIndia souvenir ☺️
🎤 @ashwinravi99 interviews Mr Perfect 10 @AjazP at the Wankhede 🎤 #INDvNZ @Paytm
Watch this special by @28anand 🎥 🔽https://t.co/8fBpJ27xqj pic.twitter.com/gyrLLBcCBM
జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఆ తర్వాత అజాజ్ పటేల్ పది వికెట్లు తీశారని చెబుతుంటే ఏమనిపిస్తోందని పటేల్‌ను యాష్ ప్రశ్నించాడు. అందుకతడు ఎంతో సంతోషంగా ఉందని బదులిచ్చాడు. 'మీ కన్నా ఎక్కువ అనుభవం నాకేమీ లేదు' అని వినయంగా పేర్కొన్నాడు. ఆ తర్వాత తన జెర్సీపై టీమ్‌ఇండియా క్రికెటర్లు సంతకాలు చేసిన జెర్సీని అతడికి బహూకరించాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్లో పంచుకొంది.
You just cannot miss this 🗣️ 🎥@ashwinravi99 & @AjazP in one frame 👍 👍
— BCCI (@BCCI) December 6, 2021
Stay tuned for this folks ⌛
Interview coming up soon on https://t.co/Z3MPyesSeZ#TeamIndia #INDvNZ @Paytm pic.twitter.com/mCzzMuQ7aZ
Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్.. కిర్రాక్! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్!
Also Read: PV Sindhu: ఫైనల్స్‌లో పీవీ సింధుకి చుక్కెదురు.. ఆమె చేతిలో వరుసగా మూడో ఓటమి!
Also Read: Ashes 2021-22: యాషెస్ మొదటి టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు ఇదే.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
Also Read: India South Africa Tour: షాక్..! అజింక్య రహానెపై వేటు.. రోహిత్‌కు వైస్ కెప్టెన్సీ!
Also Read: IND vs NZ 2nd Test: ముంబై టెస్టులో 372 పరుగులతో టీమిండియా ఘన విజయం.. కివీస్‌పై టెస్ట్ సిరీస్ కైవసం