By: ABP Desam | Updated at : 05 Dec 2021 05:48 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఆస్ట్రేలియా జట్టు(ఫైల్ ఫొటో)
ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ యాషెస్ సిరీస్‌లో మొదటి టెస్టు మ్యాచ్ బ్రిస్బేన్‌లో జరగనుంది. ఈ టెస్టులో ఆడే జట్టును ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 8వ తేదీన బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్యాట్ కమిన్స్‌కు కెప్టెన్సీని అందించింది. ఇతను ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జో రూట్ మాత్రం తమ తుదిజట్టును ఇంకా ప్రకటించలేదు. ఈ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్ ఓపెనింగ్ చేయనున్నారు.
వీరిద్దరి తర్వాత స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషగ్నే టాప్ ఆర్డర్‌లో ఉండనున్నారు. ఇక మిడిలార్డర్‌లో ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారేలు జట్టు బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ప్యాట్ కమిన్స్, జోష్ హజిల్‌వుడ్, మిషెల్ స్టార్క్‌లు ఫాస్ట్ బౌలింగ్ చేయనున్నారు. నాథన్ లియోన్ జట్టులో ఏకైక స్పిన్నర్.
ఉస్మాన్ ఖ్వాజా, మైకేల్ నీసెర్, జై రిచర్డ్‌సన్, మిషెల్ స్వెప్సన్ వంటి ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కలేదు. మొదటి టెస్టు డిసెంబర్ 8వ తేదీన జరగనుండగా... డిసెంబర్ 16వ తేదీ నుంచి రెండో టెస్టు, 26వ తేదీ నుంచి మూడో టెస్టు, జనవరి 5వ తేదీ నుంచి నాలుగో టెస్టు, జనవరి 14వ తేదీ నుంచి ఐదో టెస్టు జరగనున్నాయి.
ఆస్ట్రేలియా తుదిజట్టు
మార్కర్ హారిస్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారే (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిషెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హజిల్‌వుడ్
Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్.. కిర్రాక్! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్!
Also Read: PV Sindhu: వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు చేరిన సింధు.. ప్రత్యర్థి ఎవరంటే?
Also Read: Ajaz Patel Record: 10 వికెట్ల ఫీట్.. ముగ్గురిలో కామన్ పాయింట్ ఒకటే.. వారికి మాత్రమే సాధ్యమా?
Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
RCB Vs GT: కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ - ప్లేఆఫ్స్‌కు చేరాలంటే బెంగళూరు కష్టపడాల్సిందే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!
RCB Vs GT Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ - బెంగళూరుకు భారీ గెలుపు అవసరం!
IPL 2022: ఐపీఎల్ 2022 మెగా ఫైనల్ టైమింగ్‌లో మార్పు! ఈ సారి బాలీవుడ్ తారలతో..
GT vs RCB: అడకత్తెరలో ఆర్సీబీ! GTపై గెలిచినా దిల్లీ ఓడాలని ప్రార్థించక తప్పదు!
Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !
ASI Attacks Dhaba Staff: మద్యం మత్తులో ఏఎస్ఐ వీరంగం - బిర్యానీ పెట్టలేదని హోటల్ సిబ్బందిపై బూతులు, దాడి
Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్స్టాప్?
Whatsapp Premium: త్వరలో వాట్సాప్ ప్రీమియం - డబ్బులు కట్టాల్సిందేనా?