(Source: ECI/ABP News/ABP Majha)
Ajaz Patel History: 10 వికెట్ల ఘనతను 2సార్లు ప్రత్యక్ష్యంగా చూసింది ఇద్దరే! ఒకరు ద్రవిడ్.. మరొకరు ఎవరంటే?
ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీయడం దశాబ్దాలకు కానీ సాధ్యమవ్వవు. అలాంటివి ప్రత్యక్షంగా చూడాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఇద్దరికి దక్కింది. వారు పది వికెట్ల ఘనతకు రెండుసార్లు ప్రత్యక్షంగా చూశారు
రికార్డులు సృష్టించడం.. ఆ రికార్డులను స్వయంగా చూడటం అంత సులభం కాదు! ముఖ్యంగా ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీయడం వంటి ఘనతలు దశాబ్దాలకు కానీ సాధ్యమవ్వవు. అలాంటివి ప్రత్యక్షంగా చూడాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి.
అలాంటి అదృష్టం ఇద్దరికి దక్కింది. వారిద్దరూ పది వికెట్ల ఘనతకు రెండుసార్లు ప్రత్యక్షంగా చూశారు. వారే టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్.
Incredible achievement as Ajaz Patel picks up all 10 wickets in the 1st innings of the 2nd Test.
— BCCI (@BCCI) December 4, 2021
He becomes the third bowler in the history of Test cricket to achieve this feat.#INDvNZ @Paytm pic.twitter.com/5iOsMVEuWq
జిమ్ లేకర్ పది వికెట్లు పడగొట్టింది 1956లో. అప్పటికి 90ల తరంలోని క్రికెటర్లూ పుట్టలేదు! 1999లో అనిల్ కుంబ్లే పాకిస్థాన్‌పై పది వికెట్ల ఘనత అందుకోవడం చాలా మంది చూశారు. ప్రత్యక్షంగా చూసింది మాత్రం కొందరే. కుంబ్లే ఈ ఘనత సాధించినప్పుడు రాహుల్ ద్రవిడ్, జవగళ్ శ్రీనాథ్ జట్టులో ఉన్నారు. జంబో రికార్డును కళ్లారా చూసి ఆస్వాదించారు.
ఆ జట్టులో ఆడిన క్రికెటర్లంతా ఇప్పుడు రిటైర్ అయ్యారు. అయితే రాహుల్ ద్రవిడ్ టీమ్ఇండియా కోచ్ కావడం, జవగళ్ శ్రీనాథ్ ఐసీసీ రిఫరీ కావడంతో 22 ఏళ్ల తర్వాత పది వికెట్ల ఘనతను చూడగలిగారు.
ఇక పది వికెట్ల ఘనత అందుకున్న అజాజ్ పటేల్‌ను క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు, ఆటగాళ్లు అభినందిస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్ మైదానంలోనే స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు. మరోవైపు పది వికెట్ల క్లబ్‌లోకి పటేల్‌ను కుంబ్లే ఆహ్వానించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు.
Game recognises game! 🤜🤛#INDvNZ pic.twitter.com/62jMgkF3Tx
— BCCI (@BCCI) December 4, 2021
Also Read: Kohli ODI Captaincy: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!
Also Read: Ganguly on Laxman: హైదరాబాద్‌ను వదిలేస్తున్న వీవీఎస్.. మా లక్ష్మణ్ బంగారం అంటున్న గంగూలీ!
Also Read: Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి