By: ABP Desam | Updated at : 05 Dec 2021 04:24 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రన్నరప్‌గా నిలిచిన సింధు, విజేతగా నిలిచిన అన్ సెయాంగ్
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఓటమిపాలైంది. ఇండోనేసియాలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాకు చెందిన ప్రపంచ ఆరో ర్యాంకర్ అన్ సెయాంగ్ సింధును వరుస సెట్లలో 16-21, 12-21 తేడాతో చిత్తు చేసింది.
దీంతో సింధు రజతంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది సింధుకు అస్సలు కలిసిరాలేదు. ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా సింధు గెలవలేకపోయింది. తొలి గేమ్‌లో అన్ సెయాంగ్ దూకుడుగా ఆడగా.. పీవీ సింధు డిఫెన్స్‌లో పడింది. దీంతో అన్ సెయాంగ్ విరామ సమయానికి 11-6తో ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత సింధు పాయింట్లు సాధించినా అప్పటికే ఆలస్యం అయింది. 21-16తో తొలి గేమ్‌ను దక్షిణకొరియా ప్లేయర్ సొంతం చేసుకుంది.
ఇక రెండో గేమ్‌ను సింధు అద్భుతంగా ప్రారంభించింది. వెంటనే రెండు పాయింట్లు సాధించింది. ఆ తర్వాత సెయాంగ్ కూడా రెండు పాయింట్లు సాధించి స్కోరు సమం చేసింది. విరామం తర్వాత అన్ సెయాంగ్ ఆధిపత్యం చెలాయించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. అన్ సెయాంగ్ చేతిలో సింధు ఓటమి పాలవడం ఇది మూడోసారి.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో తుది పోరుకు చేరడం సింధుకు ఇది మూడోసారి. 2018 సీజన్‌లో తెలుగు తేజం వరల్డ్ టూర్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ టోర్నీకి ముందు సింధు.. ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్‌లో సెమీస్ వరకు చేరుకుంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు చేరినా టైటిల్ మాత్రం దక్కలేదు. ఈ ఏడాది సింధుకు అస్సలు కలిసిరాలేదు. చివరగా టోక్యో ఒలింపిక్స్ 2020లో సింధు కాంస్య పతకాన్ని సాధించింది.
Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్.. కిర్రాక్! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్!
Also Read: PV Sindhu: వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు చేరిన సింధు.. ప్రత్యర్థి ఎవరంటే?
Also Read: Ajaz Patel Record: 10 వికెట్ల ఫీట్.. ముగ్గురిలో కామన్ పాయింట్ ఒకటే.. వారికి మాత్రమే సాధ్యమా?
Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
MI vs SRH, Match Highlights: రమణను నమ్మని డేవిడ్ - సన్‌రైజర్స్‌ను గెలిపించిన ఆ రనౌట్!
MI vs SRH, 1 Innings Highlights: ఫైనల్ ఆడినట్టుగా చితక్కొట్టిన సన్‌రైజర్స్ - ముంబయికి భారీ టార్గెట్!
MI vs SRH: లక్కు హిట్‌మ్యాన్ వైపే! టాస్ ఓడిన కేన్ మామ!
Tilak Varma: ట్విటర్లో తిలక్ వర్మ ట్రెండింగ్- సన్నీ గావస్కర్ సెన్సేషనల్ కామెంట్స్
IPL Playoffs Scenarios: ఆర్సీబీకి హార్ట్ అటాక్ తెప్పించిన పంత్ సేన! 'జస్ట్' ఓడిపోతే ప్లేఆఫ్స్‌కు LSG, RR!
Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మిత్రులు సజీవదహనం
Chandrababu Tour : నేడు కడప జిల్లాలో చంద్రబాబు టూర్, పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం
Astrology: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?