By: ABP Desam | Updated at : 06 Dec 2021 10:51 AM (IST)
రెండో టెస్టులో భారత్ ఘన విజయం (Photo Credit: Twitter)
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో 372 పరుగుల తేడాతో కివీస్‌పై విజయఢంకా మోగించింది. ముంబై వేదికగా జరిగిన టెస్టులో 140/5తో సోమవారం ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ మరో 27 పరుగులు జత చేసి 5 వికెట్లు కోల్పోయింది. నేడు మ్యాచ్ మొదలైన 60 నిమిషాల లోపే భారత బౌలర్లు కివీస్ కథ ముగించారు. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 167 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టు డ్రా కావడం తెలిసిందే.
INDIA WIN by 372 runs 👏👏
— BCCI (@BCCI) December 6, 2021
Scorecard - https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/frGCmHknNP
భారత్ విజయానికి 5 వికెట్లు అవసరం కాగా, నేటి ఉదయం ఆట ప్రారంభం కాగానే జయంత్ యాదవ్ వికెట్ల వేట మొదలుపెట్టాడు. నేడు 4 వికెట్లు జయంత్ తన ఖాతాలో వేసుకోగా, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. కేవలం గంట సమయంలోనే కివీస్ చివరి 5 వికెట్లను కోల్పోవడంతో భారత్ 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్ లో డారిల్ మిచెల్ (60; 7X4, 2X6) ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించగా.. హెన్రీ నికోల్స్ (44; 8X4) పరవాలేదని పించాడు. ఈ ఇన్నింగ్స్‌లో జయంత్, అశ్విన్ 4 వికెట్లతో రాణించగా.. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ లభించింది.
Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!
#TeamIndia win the 2nd Test by 372 runs to clinch the series 1-0.
— BCCI (@BCCI) December 6, 2021
Scorecard - https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/uCdBEH4M6h
న్యూజిలాండ్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి చేసిన పరుగులు 229 కాగా, భారత్ తొలి, రెండో ఇన్నింగ్స్‌ల్లోనూ ఇంతకన్నా ఎక్కువ పరుగులు చేయగం విశేషం. తొలి టెస్టులో చివర్లో తడబాటుకు లోనై డ్రా చేసుకున్న టీమిండియా తనదైన మార్క్‌తో ముంబై టెస్టు విజయంతో కివీస్‌పై టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 325 పరుగులకు ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62 పరుగులకు ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 276/7 డిక్లేర్డ్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 167 పరుగులకు ఆలౌట్
SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!
IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక
PM Modi: థామస్ కప్ గెలిచిన టీంతో ప్రధాని చిట్‌చాట్- దేశం గర్వపడేలా చేశారని కితాబు
MI vs DC: ముంబయి గెలవగానే కోహ్లీ ఎమోషన్ చూడండి! ఆర్సీబీ డెన్‌లో అరుపులు, కేకలు!
Rishabh Pant: ఎంత పనిచేశావ్ పంత్! టిమ్డేవిడ్పై రివ్యూ ఎందుకు అడగలేదంటే?
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?