అన్వేషించండి

India South Africa Tour: షాక్‌..! అజింక్య రహానెపై వేటు.. రోహిత్‌కు వైస్‌ కెప్టెన్సీ!

అజింక్య రహానెకు ఇకపై టీమ్‌ఇండియాలో చోటు కష్టమే అనిపిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు అతడిని ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తోంది. వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్‌శర్మకు అప్పగించనున్నారు.

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు అజింక్య రహానెకు కష్టకాలం మొదలైంది! దక్షిణాఫ్రికా పర్యటనకు అతడు ఎంపికవ్వడం కష్టమేనని తెలుస్తోంది. పైగా వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్‌శర్మకు అప్పగించాల్సిన అగత్యం ఏర్పడినట్టు సమాచారం.

అజింక్య రహానెకు ఇకపై టీమ్‌ఇండియాలో చోటు కష్టమే అనిపిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు అతడిని ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తోంది. ముంబయి టెస్టు ముగియగానే సెలక్షన్‌ కమిటీ సమావేశం కానున్నారు. జట్టును ఎంపిక చేసిన సోమవారం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జింక్స్‌ పైనే ఎక్కువగా చర్చిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే రెండుమూడేళ్లుగా అతడు ఫామ్‌లో లేడు. భారీ స్కోర్లు చేయడం లేదు. పైగా కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు పరుగులు చేస్తూ అతడి చోటును ప్రశ్నార్థకం చేస్తున్నారు.

'ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. అజింక్య రహానె చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతడికి జట్టు యాజమాన్యం అండదండలు ఉన్నాయి. ఇప్పటికైతే అతడి కెరీర్‌ అద్భుతంగా సాగింది. అతడి ఎంపిక పూర్తిగా సెలక్షన్‌ కమిటీపై ఆధారపడి ఉంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

'అజింక్య ఒక అడుగు వెనక్కి వేసి బ్యాటింగ్‌ ఇబ్బందులను పరిష్కరించుకోవాల్సిందే. అదనపు బాధ్యతలతో అతడిపై భారం వేయాలని మేం  కోరుకోవడం లేదు. రోహిత్‌ ఇప్పటికే నాయకత్వ బృందంలో ఉన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలకు అతడే మెరుగైన వాడు' అని ఆ అధికారి వెల్లడించాడు.

దక్షిణాఫ్రికా పర్యటన కొన్ని రోజులు ఆలస్యంగా మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్‌ నేపథ్యంలో పటిష్ఠమైన బయో బుడగలు ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అక్కడ మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడాల్సింది. షెడ్యూలు వెనక్కి జరపడంతో టీ20లను వాయిదా వేశారు. కాగా ముంబయి టెస్టు ముగియగానే అక్కడే శిబిరం ఏర్పాటు చేయాలని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ బీసీసీఐకి సూచించాడు. విశ్రాంతి తీసుకుంటున్న జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, రిషభ్ పంత్‌ వంటి ఆటగాళ్లను అక్కడికి రప్పించనున్నారు. ఆ తర్వాత వారిని బుడగలోకి పంపించనున్నారు.

Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్‌.. కిర్రాక్‌! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్‌!

Also Read: PV Sindhu: వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు చేరిన సింధు.. ప్రత్యర్థి ఎవరంటే?

Also Read: Ajaz Patel Record: 10 వికెట్ల ఫీట్.. ముగ్గురిలో కామన్ పాయింట్ ఒకటే.. వారికి మాత్రమే సాధ్యమా?

Also Read: Ajaz Patel History: 10 వికెట్ల ఘనతను 2సార్లు ప్రత్యక్ష్యంగా చూసింది ఇద్దరే! ఒకరు ద్రవిడ్‌.. మరొకరు ఎవరంటే?

Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!

Also Read: IND vs NZ , Ajaz patel: అజాజ్‌ అదరహో..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన భారత సంతతి స్పిన్నర్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Rs 2000 Notes: రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Embed widget