IND vs NZ Mumbai Test: ఈ చిత్రం మాటల్లో చెప్పలేనిది! అక్షర్‌, అజాజ్‌, రచిన్‌, జడేజా చిత్రాలు వైరల్‌!

ముంబయి మ్యాచులో గెలుపోటములకు సంబంధం లేకుండా కొందరు ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు. అందుకే వారంతా కలిసి దిగిన చిత్రాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

FOLLOW US: 

ముంబయి టెస్టులో టీమ్‌ఇండియా చిరస్మరణీయ విజయం అందుకుంది. తన సుదీర్ఘ ఫార్మాట్‌ చరిత్రలోనే పరుగుల పరంగా ఇది అతిపెద్ద విజయం. మ్యాచులో గెలుపోటములకు సంబంధం లేకుండా కొందరు ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు. అందుకే వారంతా కలిసి దిగిన చిత్రాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

భారత సంతతి స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ ఈ మ్యాచులో అద్భుతమైన రికార్డు అందుకున్నాడు. దాదాపు 20 ఏళ్ల క్రితం అనిల్‌ కుంబ్లే సాధించిన ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లు తీసి మొత్తంగా 14 వికెట్లు తీశాడు. ఇలాంటి రికార్డు మళ్లీ సాధించాలంటే అంత సులభం కాదు. కివీస్‌ మరో క్రికెటర్‌ రచిన్ రవీంద్ర సైతం భారత సంతతి వ్యక్తే. అతడు బ్యాటింగ్‌తో పాటూ బౌలింగ్‌ చేస్తాడు. ఈ మ్యాచులో 3 వికెట్లు తీశాడు.

ప్రస్తుతం నలుగురు ఆటగాళ్లు తీసుకున్న చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో అక్షర్‌, అజాజ్‌ పక్కపక్కనే నిలబడ్డారు. దాంతో వారి జెర్సీల వెనక పేర్లు అక్షర్‌ పటేల్‌గా కనిపించాయి. ఇక రచిన్‌ పక్కన రవీంద్ర జడేజా నిలబడటంతో రచిన్‌ రవీంద్ర అనే పేరు వచ్చింది. భారత్‌ ఆటగాళ్ల వారితో కలిసి సరదాగా గడపడం, చిత్రాలు దిగడం బాగుంది. 

వాంఖడే వేదికగా జరిగిన ఈ టెస్టులో టీమ్‌ఇండియా ఏకంగా 372 పరుగుల తేడాతో విజయం అందుకొంది. తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్‌ శతకం చేయడంతో 325 పరుగులు చేసింది. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను కేవలం 62 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఫాలో ఆన్‌ ఆడించకుండా నేరుగా బ్యాటింగ్‌కు దిగి రెండో ఇన్నింగ్స్‌లో 276/7కు డిక్లేర్‌ చేసింది. భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కివీస్‌ను అశ్విన్‌ దెబ్బకొట్టాడు. దాంతో ప్రత్యర్థి కేవలం 167 పరుగులకే పరిమితం అయింది. భారత సంతతి స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం కివీస్‌కు ఊరట కలిగించే అంశం.

Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్‌.. కిర్రాక్‌! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్‌!

Also Read: PV Sindhu: ఫైనల్స్‌లో పీవీ సింధుకి చుక్కెదురు.. ఆమె చేతిలో వరుసగా మూడో ఓటమి!

Also Read: Ashes 2021-22: యాషెస్ మొదటి టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు ఇదే.. కొత్త కెప్టెన్ ఎవరంటే?

Also Read: India South Africa Tour: షాక్‌..! అజింక్య రహానెపై వేటు.. రోహిత్‌కు వైస్‌ కెప్టెన్సీ!

Also Read: IND vs NZ 2nd Test: ముంబై టెస్టులో 372 పరుగులతో టీమిండియా ఘన విజయం.. కివీస్‌పై టెస్ట్ సిరీస్ కైవసం

Published at : 06 Dec 2021 01:20 PM (IST) Tags: Virat Kohli Indian Cricket Team Tom Latham Ravindra Jadeja Axar Patel Ind Vs NZ New Zealand cricket team Rachin Ravindra IND vs NZ 2021 IND vs NZ Test series wankhade stadium Ajaz patel

సంబంధిత కథనాలు

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్‌ మియా! హైదరాబాదీ పేస్‌ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు

RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్‌ మియా! హైదరాబాదీ పేస్‌ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు

IPL 2022, Faf du Plessis: ఆర్సీబీ భవిష్యత్తు చెప్పిన డుప్లెసిస్‌ - భారత కల్చర్‌కు పెద్ద ఫ్యాన్‌ అంటూ పొగడ్త

IPL 2022, Faf du Plessis: ఆర్సీబీ భవిష్యత్తు చెప్పిన డుప్లెసిస్‌ - భారత కల్చర్‌కు పెద్ద ఫ్యాన్‌ అంటూ పొగడ్త

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

టాప్ స్టోరీస్

AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !