Yuvraj Singh Comeback Rumor: యువరాజ్ సర్‌ప్రైజ్..! సెంకడ్ ఇన్నింగ్స్‌పై మళ్లీ ట్వీట్
యువరాజ్ సింగ్ సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అయ్యాడు. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేశాడు. సర్‌ప్రైజ్ ఏంటో త్వరలోనే చెబుతానని అంటున్నాడు.
టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తానంటున్నాడు. ఈ ఏడాదిలో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసిందని పేర్కొన్నాడు. తన రెండో ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండాలని సూచించాడు. ఇంతకీ అతడు చేసే సర్‌ప్రైజ్ ఏంటో తెలియడం లేదు!
అంతర్జాతీయ క్రికెట్లో విజయవంతమైన ఆల్‌రౌండర్లలో యువరాజ్ సింగ్ ఒకరు. నాలుగో స్థానంలో ఆడుతూ జట్టుకు వెన్నెముకగా ఉండేవాడు. వికెట్లు పడకుండా అడ్డుకొనేవాడు. అవసరమైన సమయంలో గేర్లు మారుస్తూ సిక్సర్లు బాదేస్తూ మ్యాచులను ముగించేవాడు. 2017లో యువీ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ ఆడి రెండేళ్ల కిందట వీడ్కోలు పలికాడు. కొన్నాళ్లు విదేశీ క్రికెట్ లీగుల్లో ఆడుతూ ఆటను ఆస్వాదించాడు.
ఈ ఏడాది నవంబర్లో పిచ్ వద్దకు తిరిగొస్తున్నాను అని యువీ ఓ సూచన చేసిన సంగతి తెలిసిందే. 'మన లక్ష్యాన్ని దేవుడే నిర్ణయిస్తాడు!! ప్రజల డిమాండ్ మేరకు బహుశా ఫిబ్రవరిలో నేను మళ్లీ పిచ్ మీదకు వస్తాను! ఇలాంటి అనుభూతికి మరొకటి సాటిరాదు! మీ అభిమానం, ప్రేమకు కృతజ్ఞతలు. ఇలాగే మద్దతివ్వండి. ఇది మన జట్టు. నిజమైన అభిమాని కఠిన సమయాల్లో అండగా నిలుస్తాడు' అని నవంబర్లో యువీ ట్వీట్ చేశాడు. అందుకు కొనసాగింపుగా ఇప్పుడు మరో ట్వీట్ చేశాడు.
'ఆ ఏడాదిలోని సమయం ఇదే. మీరు సిద్ధమేనా? ఇందుకు అవసరమైంది మీ వద్ద ఉందా? మీ అందరికీ ఓ పెద్ద సర్‌ప్రైజ్! స్టే ట్యూన్‌డ్!' అని యువీ ట్వీట్ చేశాడు. ఓ వీడియోను జత చేశాడు. అందులో యువీ ఆరు సిక్సర్లు కొట్టిన సందర్భం, రవిశాస్త్రి కామెంటరీ వంటివి ఉన్నాయి. ఇందులో యువరాజ్ సింగ్ ఇంటి తలుపును ఒకరు తట్టారు. ఇంతకీ ఎవరతడు?!
It's that time of the year. Are you ready? Do you have what it takes? Have a big surprise for all you guys! Stay tuned! pic.twitter.com/xR0Zch1HtU
— Yuvraj Singh (@YUVSTRONG12) December 7, 2021
Also Read: IND vs NZ Mumbai Test: టీమ్‌ఇండియా అతి పెద్ద విజయం.. కివీస్ అతి ఘోర పరాజయం!
Also Read: IND vs NZ Mumbai Test: ఈ చిత్రం మాటల్లో చెప్పలేనిది! అక్షర్, అజాజ్, రచిన్, జడేజా చిత్రాలు వైరల్!
Also Read: Rahul Dravid: కివీస్‌ను ఫాలోఆన్ ఆడించకపోవడానికి కారణం చెప్పిన రాహుల్ ద్రవిడ్!
Also Read: December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?
Also Read: Ashwin on Ajaz Patel: 10 వికెట్ల అజాజ్ పటేల్‌ను టీమ్‌ఇండియా గౌరవించిన తీరు చూడండి..!
Also Read: India South Africa Tour: షాక్..! అజింక్య రహానెపై వేటు.. రోహిత్‌కు వైస్ కెప్టెన్సీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి