Nuvvu Naaku Nachav Re Release: జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్ డేట్‌లో!
Nuvvu Naaku Nachav Re Release Date: విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ కథ, సంభాషణలతో రూపొందిన సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'. కొత్త ఏడాదిలో రీ రిలీజ్ చేస్తున్నారు. అదీ సెంటిమెంట్ డేట్‌లో!

Nuvvu Naku Nachav Re Release Date 2026: విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ సినిమాల్లో 'నువ్వు నాకు వచ్చావ్' ఒకటి. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ - కథనం, సంభాషణలతో రూపొందిన చిత్రమిది. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడీ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యింది.
జనవరి 1న 4kలో 'నువ్వు నాకు నచ్చావ్'!
కొత్త ఏడాది (2026)ని 'నువ్వు నాకు నచ్చావ్'తో మొదలు పెట్టడానికి శ్రీ స్రవంతి మూవీస్ రెడీ అయ్యింది. జనవరి 1, 2026న సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అది కూడా నార్మల్ రీ రిలీజ్ కాదు... 4k ఫార్మాట్ రీ రిలీజ్ చేస్తున్నారు.
శ్రీ స్రవంతి మూవీస్ సంస్థకు జనవరి 1 సెంటిమెంట్ ఉంది. తెలుగులో ధనుష్ ఫస్ట్ హిట్ 'రఘువరన్ బీటెక్'ను ఆ తేదీన విడుదల చేశారు 'స్రవంతి' రవికిశోర్. అదొక్కటే కాదు... ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నిర్మించిన 'నేను శైలజ' సినిమాను సైతం జనవరి 1న విడుదల చేశారు. తమ సంస్థకు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన సెంటిమెంట్ డేట్ జనవరి 1న ఇప్పుడు 'నువ్వు నాకు నచ్చావ్' రీ రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఓవర్సీస్ ఏరియాల్లో భారీ ఎత్తున!
'నువ్వు నాకు నచ్చావ్' మొదట విడుదల అయినప్పుడు ఆస్ట్రేలియా, యూరప్, UK వంటి ఓవర్సీస్ మార్కెట్ ఏరియాల్లో రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఆ దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. ఓవర్సీస్ తెలుగు ప్రేక్షకులు గత 25 ఏళ్లుగా పొందని అనుభూతిని ఇప్పుడు థియేటర్‌లో ఆస్వాదించనున్నారు.
వెంకటేష్ సరసన ఆర్తీ అగర్వాల్ కథానాయికగా నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో ప్రకాష్ రాజ్, చంద్ర మోహన్, సుహాసిని, సునీల్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా... త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. ఇందులో వినోదానికి చాలా మంది అభిమానులు ఉన్నారు.





















