Harbhajan singh: క్రికెట్‌కు భజ్జీ వీడ్కోలు ..! వచ్చే వారం గుడ్‌బై చెప్పేస్తాడట!

హర్భజన్‌ సింగ్‌ చివరి సారిగా 2016, మార్చిలో టీమ్‌ఇండియా తరఫున టీ20 మ్యాచ్‌ ఆడాడు. వయసు పెరగడంతో అతడిని జట్టు యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవడం మానేసింది. వచ్చే వారం గుడ్‌ బై చెప్పేస్తాడని సమాచారం.

FOLLOW US: 

టీమ్‌ఇండియా దిగ్గజ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. దాదాపుగా వచ్చే వారం గుడ్‌ బై చెప్పేస్తాడని సమాచారం. ఆ తర్వాత ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీకి మెంటార్‌ లేదా సలహాదారుగా ఉంటాడని తెలుస్తోంది.

హర్భజన్‌ సింగ్‌ చివరి సారిగా 2016, మార్చిలో టీమ్‌ఇండియా తరఫున టీ20 మ్యాచ్‌ ఆడాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లు ఎదగడం, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ వంటి యువకులు రావడంతో అతడికి అవకాశాలు కరవయ్యాయి. వయసు పెరగడంతో అతడిని జట్టు యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవడం మానేసింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ భజ్జీ ఫ్రాంచైజీ క్రికెట్‌ను విపరీతంగా ఆడాడు. దేశవాళీ క్రికెట్లో రాణించాడు. పంజాబ్‌ రంజీ జట్టుకు కెప్టెన్‌గా చేశాడు. కుర్రాళ్లను సానపట్టాడు. శుభ్‌మన్‌ గిల్‌, అర్షదీప్‌ సింగ్‌ వంటి యువకులు అతడి నాయకత్వంలో ఆడారు. కొన్నేళ్లు ముంబయికి ఆడిన హర్భజన్‌ను వదిలేయడంతో చెన్నై అతడిని కొనుగోలు చేసింది. గతేడాది కోల్‌కతాకు ఆడాడు. అయితే అతడిని ఆడించడం కన్నా ఎక్కువగా అనుభవాన్నే ఫ్రాంచైజీలు ఉపయోగించుకున్నాయి. జట్టు ఎంపిక, ఆటగాళ్లకు తర్ఫీదునివ్వడం, సలహాలు ఇవ్వడం చేయించాయి. దాంతో అతడిని ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.

'భజ్జీ పాత్ర బహుశా సలహాదారు లేదా మెంటార్‌ లేదా సలహాదారు బృందంలో భాగం కావొచ్చు. ఏదేమైనా సంప్రదింపులు జరుపుతున్న ఫ్రాంచైజీ అతడి అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. అతడు కీలకంగా వ్యవహరిస్తాడు. వేలంలో ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం పైనా సలహాలు ఇస్తాడు' అని ఐపీఎల్‌ వర్గాలు పీటీఐకి చెప్పాయి.

'హర్భజన్‌ సింగ్‌ రిటైర్మెంట్‌పై అధికారికంగా ప్రకటన చేయాలని అనుకుంటున్నాడు. అతడు ఓ ఫ్రాంచైజీతో సుదీర్ఘంగా మాట్లాడాడు. ఆ జట్టు సైతం అతడిపై ఆసక్తిగా ఉంది. ఈ ఒప్పందం మొత్తంగా పూర్తైన తర్వాత అతడు తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది' అని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి.

ముంబయి జట్టుకు ఆడినప్పుడూ భజ్జీ యువకులకు తర్ఫీదునిచ్చాడు. అలాగే చెన్నైలో స్పిన్నర్లను సానపట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నప్పుడు జట్టు ఎంపికలో కీలకంగా వ్యవహరించాడు. విలువైన సలహాలు ఇచ్చాడు. మెక్‌కలమ్‌, ఇయాన్‌ మోర్గాన్‌ అతడి సూచనలు పాటించేవారు. వరుణ్‌ చక్రవర్తి సైతం భజ్జీ నుంచి ప్రయోజనం పొందాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ వేలంలో భారీ ధర పలుకుతాడని అతడే చెప్పడం గమనార్హం.

Also Read: IND vs NZ Mumbai Test: టీమ్‌ఇండియా అతి పెద్ద విజయం.. కివీస్‌ అతి ఘోర పరాజయం!

Also Read: IND vs NZ Mumbai Test: ఈ చిత్రం మాటల్లో చెప్పలేనిది! అక్షర్‌, అజాజ్‌, రచిన్‌, జడేజా చిత్రాలు వైరల్‌!

Also Read: Rahul Dravid: కివీస్‌ను ఫాలోఆన్‌ ఆడించకపోవడానికి కారణం చెప్పిన రాహుల్‌ ద్రవిడ్‌!

Also Read: December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

Also Read: Ashwin on Ajaz Patel: 10 వికెట్ల అజాజ్‌ పటేల్‌ను టీమ్‌ఇండియా గౌరవించిన తీరు చూడండి..!

Also Read: India South Africa Tour: షాక్‌..! అజింక్య రహానెపై వేటు.. రోహిత్‌కు వైస్‌ కెప్టెన్సీ!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Dec 2021 10:12 AM (IST) Tags: Harbhajan Singh Harbhajan Singh news Harbhajan Singh IPL Harbhajan Singh retirement Harbhajan Singh career Harbhajan Singh KKR Harbhajan Singh retires

సంబంధిత కథనాలు

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

GT vs RR, Qualifier 1: జోస్‌ ది బాస్‌ - నాకౌట్‌లో బట్లర్‌ 89 - GT ముందు భారీ టార్గెట్‌ !

GT vs RR, Qualifier 1: జోస్‌ ది బాస్‌ - నాకౌట్‌లో బట్లర్‌ 89 - GT ముందు భారీ టార్గెట్‌ !

Maya Sonawane: మాయా! ఇదేం మాయ బౌలింగ్‌! వుమెన్స్‌ టీ20 ఛాలెంజ్‌లో వైరలైన బౌలింగ్‌ యాక్షన్‌

Maya Sonawane: మాయా! ఇదేం మాయ బౌలింగ్‌! వుమెన్స్‌ టీ20 ఛాలెంజ్‌లో వైరలైన బౌలింగ్‌ యాక్షన్‌

WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్‌ థండర్స్‌ ముందు సాగని హర్మన్‌ మెరుపుల్‌!

WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్‌ థండర్స్‌ ముందు సాగని హర్మన్‌ మెరుపుల్‌!

GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్‌ - రాజస్థాన్‌ తొలి బ్యాటింగ్‌

GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్‌ - రాజస్థాన్‌ తొలి బ్యాటింగ్‌
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్