X

Rahul Dravid: ద్రవిడ్‌ శాసనం..! కుంబ్లే నాటి రూల్‌ కఠినతరం చేసిన వాల్‌.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!

రాహుల్‌ ద్రవిడ్‌ జట్టు ఎంపిక నిబంధనలను కఠినతరం చేయనున్నారు! కుంబ్లే కోచింగ్‌ కాలం నాటి నియమాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ ఆడి ఫిట్‌నెస్‌, ఫామ్‌ నిరూపించుకోవాల్సిందే.

FOLLOW US: 

టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ జట్టు ఎంపిక నిబంధనలను కఠినతరం చేయనున్నారు! కుంబ్లే కోచింగ్‌ కాలం నాటి నియమాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఇకపై జాతీయ జట్టుకు ఎంపికవ్వాలంటే ఎంత పెద్ద ఆటగాడైనా దేశవాళీ క్రికెట్‌ ఆడి నిరూపించుకోవాల్సిందే!

జట్టు ఎంపిక నిబంధనలను ఇకపై కఠినంగా అమలు చేయబోతున్నారు. గాయపడ్డ ఆటగాళ్లను కోలుకోగానే జట్టులోకి తీసుకోవద్దని ద్రవిడ్‌ స్పష్టంగా చెప్పేశారు. ఇకపై టీమ్‌ఇండియాలో అడుగు పెట్టాలంటే కోలుకున్న తర్వాత కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌ ఆడి ఫిట్‌నెస్‌, ఫామ్‌ నిరూపించుకోవాల్సిందే. యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతంలోనూ గాయపడ్డ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ ఆడేవారు. రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికయ్యాక ఈ నియమాన్ని అలక్ష్యం చేశారు! ఐపీఎల్‌ ఫామ్‌ ఆధారంగానూ క్రికెటర్లను ఎంపిక చేశారు. దాంతో ఆటగాళ్లు విదేశీ పర్యటనలకు వెళ్లగానే గాయాలు బయట పడుతుండేవి. రిజర్వు ఆటగాళ్లు ఉండటంతో సరిపోయేది! లేదంటే మళ్లీ భారత్‌ నుంచి పంపించేవారు. ఇకపై అలా జరగొద్దని ద్రవిడ్‌ స్పష్టం చేశారట. ఎన్‌సీయేలో రీహబిలిటేషన్‌కు వెళ్లి దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందేనని చెప్పారని తెలిసింది.

'ఈ విధానం ఎప్పట్నుంచో ఉంది. కొన్నేళ్లుగా దీనిని కఠినంగా అమలు చేయడం లేదు. అన్ని ఫార్మాట్లు ఆడుతున్నవారు తప్ప మిగతా అందరూ దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందేనని రాహుల్‌ స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఎవరైనా గాయపడితే కోలుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్‌ ఆడి ఫిట్‌గా ఉన్నానని నిరూపించుకోవాలి' అని ఓ బీసీసీఐ అధికారి వివరించారు.

'చూడండి.. వ్యవస్థను అందరూ అర్థం చేసుకోవాలి. మనకు ప్రపంచంలోనే మేటైన దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థ ఉంది. విజయ్‌ హజారే లేదా రంజీల్లో పరీక్షించుకుంటే ఆటగాళ్లకేమీ నష్టం జరగదు. పైగా వారికే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆల్‌రౌండర్‌గా పునరాగమనం చేసేటప్పటికి హార్దిక్‌ పాండ్య ఆత్మవిశ్వాస లేమితో ఉన్నాడు. పూర్తిగా ఫిట్‌నెస్‌తో ఉన్నానని అతడు నిరూపించుకోవాలి. ఎన్‌సీయేకు  వెళ్లాలి. రంజీ ట్రోఫీ ఆడాలి' అని ఆ అధికారి వెల్లడించారు.

Also Read: IND vs NZ Mumbai Test: ఈ చిత్రం మాటల్లో చెప్పలేనిది! అక్షర్‌, అజాజ్‌, రచిన్‌, జడేజా చిత్రాలు వైరల్‌!

Also Read: Ashwin on Ajaz Patel: 10 వికెట్ల అజాజ్‌ పటేల్‌ను టీమ్‌ఇండియా గౌరవించిన తీరు చూడండి..!

Also Read: Sara Tendulkar: మోడలింగ్‌లోకి సారా తెందూల్కర్‌..! ప్రచారచిత్రం అద్దిరిపోయిందిగా!!

Also Read: Yuvraj Singh Comeback Rumor: యువరాజ్‌ సర్‌ప్రైజ్‌..! సెంకడ్‌ ఇన్నింగ్స్‌పై మళ్లీ ట్వీట్‌

Also Read: Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Also Read: Harbhajan singh: క్రికెట్‌కు భజ్జీ వీడ్కోలు ..! వచ్చే వారం గుడ్‌బై చెప్పేస్తాడట!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: anil kumble Rahul Dravid India Tour of South Africa policy domestic cricket selection

సంబంధిత కథనాలు

Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్‌ శర్మకు మాత్రం నో ఛాన్స్!

Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్‌ శర్మకు మాత్రం నో ఛాన్స్!

Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!

Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!

Lakshya Sen Wins Final: కేక పెట్టించిన కుర్రాడు! ప్రపంచ ఛాంఫ్‌కు షాకిచ్చిన లక్ష్యసేన్‌

Lakshya Sen Wins Final: కేక పెట్టించిన కుర్రాడు! ప్రపంచ ఛాంఫ్‌కు షాకిచ్చిన లక్ష్యసేన్‌

Anushka on Kohli Resignation: ఎంతో ఎత్తుకు ఎదిగావు.. లోపల, బయట కూడా.. విరాట్‌పై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్!

Anushka on Kohli Resignation: ఎంతో ఎత్తుకు ఎదిగావు.. లోపల, బయట కూడా.. విరాట్‌పై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్!

Anurag Thakur on Twitter: 11,000 అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్‌ స్టేడియం.. ఇండియాలోనే!

Anurag Thakur on Twitter: 11,000 అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్‌ స్టేడియం.. ఇండియాలోనే!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

TS Schools : తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

TS Schools  :  తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

AP Liquor Shops: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు

AP Liquor Shops: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు

Guntur Car Accident: గుంటూరు జిల్లాలో విషాదం... చెరువులో కారు బోల్తా, నలుగురు మృతి

Guntur Car Accident: గుంటూరు జిల్లాలో విషాదం... చెరువులో కారు బోల్తా, నలుగురు మృతి

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!