Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Bills Passed In Telangana Assembly | విపక్షా నిరసనల మధ్య తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లులు ఆమోదించారు.

Telangana Assembly approves 3 key bills amid opposition protests | హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు అధికార కాంగ్రెస్ సభ్యులు వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులుగా కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్లలో రైతుల అరెస్ట్ ఘటనపై సభలో చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. చర్చకు బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్ ను స్పీకర్ ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు. మరోవైపు వాయిదా తీర్మానాల కోసం బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ అసెంబ్లీ 3 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.
విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులతో పాటు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. విపక్ష సభ్యులు లగచర్లలో రైతుల చేతికి సంకెళ్లు వేయడం దారుణమంటూ విపక్షాలు గగ్గోలు చేస్తుండగా నిరసనల మధ్య మూడు బిల్లులకు ఆమోదం లభించింది. చర్చ జరపకుండా బిల్లులను ఆమోదించడంపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అనంతరం రాష్ట్రంలో పర్యాటక రంగంలో చేయాల్సిన మార్పులు, నూతన విధానంపై కొంతసేపు చర్చ జరగగా.. తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది.
కాంగ్రెస్ అప్పులపై మాజీ మంత్రులు ఫైర్
కాంగ్రెస్ పార్టీ ఒక్క ఏడాది పాలనలో రూ. 1,27,208 కోట్లు అప్పు చేసిందని, అప్పులు కొనసాగితే వచ్చే ఐదేళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు అని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో పేర్కొన్నారు. కానీ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన మొత్తం అప్పు కేవలం రూ. 4,17,496 కోట్లు మాత్రమే అన్నారు. మిషన్ భగీరథ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులను కట్టి ఆస్తుల కల్పన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే.. అప్పులు చేసి, కమీషన్లు పంచుకుని తిన్నది కాంగ్రెస్ పార్టీ అని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ సర్కార్ తక్కువ సమయంలోనే తెలంగాణను భారీగా అప్పుల పాలు చేసిందన్నారు. ఎన్నికల గ్యారంటీ హామీలు అమలు చేయకుండా, కొత్త ప్రాజెక్టులు కట్టకుండా ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. రాష్ట్రంలో సంపద సృష్టికి కాకుండా.. సొంత ఆస్తులు పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడం క్షమించరాని నేరం అని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏడాదిగా కాంగ్రెస్ చేసిన అప్పు 1,27,208 కోట్ల రూపాయలు అప్పుచేసినా, ఏడాది ఆదాయం వచ్చినా.. చిన్న చిన్న పెండింగ్ బిల్లులను ఎందుకు చెల్లించడం లేదు. ఆ డబ్బంతా ఎటు పోతుంది? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సభలో ప్రశ్నించారు.
Also Read: BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బేడీలు వేసిందని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల విద్యాసారగ్ రావు ఆరోపించయారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అణిచివేత విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జగిత్యాలలో బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.






















