Yuvraj Singh NFT: బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చిన యువరాజ్ సింగ్.. తన విలువైన ట్రోఫీలు ఎన్‌ఎఫ్‌టీ చేస్తూ కీలక నిర్ణయం
Happy Birthday Yuvraj NFT: స్టార్ ఆల్ రౌండర్, టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన పుట్టినరోజు కానుకగా భవిష్యత్ ప్రణాళికల్ని ప్రకటించాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు.
Yuvraj Birthday NFT: టీమిండియాకు రెండు వరల్డ్ కప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ యువరాజ్ సింగ్. నేడు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్ చేశాడు. క్రికెటర్ గా తన విలువైన క్షణాలు, ట్రోఫీలు, అవార్డులను NFT (నాన్ ఫంజిబుల్ టోకెన్) చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించి ఓ వీడియోను రూపొందించిన యువీ... తన ఇంటిలో తనకున్న ట్రోఫీలు, అవార్డులను అభిమానులకు చూపిస్తూ మాట్లాడాడు.
తన జీవితంలో ఫ్యాన్స్ ఇచ్చిన మద్దతు, వారి సహకారం మరిచిపోలేనిదన్న యువీ... అలాంటి జ్ఞాపకాలను అభిమానులకు అందించాలనే NFT చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ఆసియా కు చెందిన బ్లాక్ చైన్ టెక్నాలజీ సంస్థ కలెక్సన్ తో టైఅప్ అవుతున్నట్లు ప్రకటన చేశాడు. ఈ ప్రక్రియ డిసెంబర్ 25న ప్రారంభమవుతుందని తన పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ కి గుడ్ న్యూ స్ చెప్పాడు. కలెక్సన్ సంస్థ యువరాజ్ సింగ్ సహా మరో 30మంది దేశ, విదేశాలకు చెందిన స్టార్ క్రికెటర్ల విలువైన మూమెంట్స్ ని NFT చేస్తోంది. తద్వారా వర్చువల్ స్పేస్ లో యువీ లాంటి క్రికెటర్ల ఘనతలను ఈ ఆక్షన్ పెట్టనున్నారు.
అసలేంటి NFT అంటే... నాన్ ఫంజిబుల్ టోకెన్. అంటే సెలబ్రిటీలు సాధించిన ఘనతలకు నిదర్శనమైన ట్రోఫీలు, వారి స్పోర్ట్ కిట్స్, మ్యూజిక్ ఇంస్ట్రూమెంట్స్, ఆటగాళ్ల స్పెషల్ జెర్సీలు లాంటి వాటిని వర్చువల్ గా ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చన్నమాట. వేలం కోసం క్రిప్టో కరెన్సీని కూడా వాడతారు. ఉదాహరణకు 2011 ప్రపంచ కప్ లో యువరాజ్ సింగ్ మ్యాన్ ది టోర్నీ ని ఆయన NFT చేస్తే... దానికి కంపెనీ ఓ బేస్ ప్రైస్ ను నిర్ణయిస్తుంది. దానిని ఆక్షన్ లో పెడుతుంది. NFTగా మారిన ఆ ట్రోఫీని వేలంలో ఎవరైనా ఎక్కువకు పాడుకుని సొంతం చేసుకోవచ్చు. కానీ ఫిజికల్ గా అంటే ఆ ట్రోఫీని కొనుక్కున్న వ్యక్తికి ఇచ్చేయరు. కానీ దానిపై హక్కులు యువీ తో పాటు సదరు వ్యక్తికి కూడా ఉంటాయి.
Also Read: CSK KKR Retentions 2022: చావుదెబ్బ కొట్టారు కదయ్యా.. చెన్నై, కోల్‌కతా నిర్ణయాల వెనక పెద్ద స్కెచ్!
Being there from ball 1 to the time I decided to hang up my jersey, the fans have always been with me.Thank u for cheering in my highs & giving strength in my lows.On my b’day I’m proud to announce a special gift for u-Yuvraj Singh NFT Collection in partnership with @colexionNFT pic.twitter.com/EpCaAkyKnS
— Yuvraj Singh (@YUVSTRONG12) December 12, 2021
భవిష్యత్తులో కావాలంటే అతను దాన్ని తిరిగి విక్రయించుకోవచ్చు. హక్కులకు అథెంటిసిటీ, సెక్యురిటీ ఉంటుంది. వేరే వాళ్లు వాటిని చోరీ చేయలేరు. ఇటీవల కాలంలో యువతరం పెద్దఎత్తున క్రిప్టో కరెన్సీ పై ఇన్వెస్ట్ (భారీ పెట్టుబడులు) చేస్తోంది. అంతే కాదు ఇండియా లాంటి దేశాల్లో సైతం క్రిప్టో ను లీగలైజ్ చేయాలనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో యూత్ ఇంత క్రేజ్ చూపిస్తున్న NFTల్లో అడుగు పెట్టడం ద్వారా స్టార్ క్రికెటర్లు ఆదాయాన్ని ఆర్జించుకోవటంతో పాటు.. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భవిష్యత్ తరాలకు వీటిని అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Rahul Dravid: ద్రవిడ్ శాసనం..! కుంబ్లే నాటి రూల్ కఠినతరం చేసిన వాల్.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!