PM Modi Master Plan With Russia | ట్రంప్ కు దిమ్మతిరిగి బొమ్మ కనపడనుందా.? | ABP Desam
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కు భారత్ తన దైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం ఎన్నికల ప్రచారాలు కూడా చేసిన మోదీని అవమానించేలా..యావత్ భారత దేశాన్ని ఇబ్బంది పెట్టేలా 50 శాతం పన్నుల టారిఫ్ వేసి పగతీర్చుకునే పని మొదలుపెట్టింది అమెరికా. ఉక్రెయిన్ తో యుద్ధం ఆగాలంటే భారత్ రష్యాతో వ్యాపారం ఆపేయాలని మొదలు పెట్టిన అమెరికా..ఆ మాట వినటం లేదు కాబట్టి పన్నులు వేస్తున్నామని మన ఎగుమతులను నిలిపివేసే ప్రక్రియ ప్రారంభించింది. దీనికి మోదీ కౌంటర్ ఏంటంటే రష్యాకు మన దేశ జాతీయ భద్రతా సలహాదారు..జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే అజిత్ ధోవల్ ను రష్యాకు పంపారు మోదీ. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. జనరల్ గా పుతిన్ ఏదైనా దేశ అధ్యక్షుడు, లేదా ప్రధానితోనే మాట్లాడతారు వాళ్లతోనే భేటీ అవుతారు. అలాంటిది అజిత్ ధోవల్ తో భేటీ కావటం చూస్తుంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేశారని అనిపిస్తోందంటున్న రాజకీయ విశ్లేషకులు. పైగా నిన్న సాయంత్రం మోదీ కూడా ఓ ట్వీట్ పెట్టారు. తన స్నేహితుడు పుతిన్ తో ఫోన్ కాల్ లో మాట్లాడానని..ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడానని..పుతిన్ కూడా త్వరలో భారత్ సందర్శనకు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. రష్యా బంధం వద్దని అమెరికా చెబుతుంటే...78ఏళ్ల బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని మోదీ ట్వీట్ పెట్టడం చూస్తుంటే అమెరికా గట్టి ఆన్సర్ ఇవ్వటానికి మోదీ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారని భావించొచ్చని అంటున్నారు విశ్లేషకులు చూడాలి మరి. అటు చైనా పర్యటనకు సిద్ధమవుతున్న ప్రధాని మోదీ..పెద్దన్న అమెరికాకు దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇస్తారేమో.





















