అన్వేషించండి

AP CM Chandrababu: 633 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ, హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

Nellore News | నెల్లూరు భగత్‌సింగ్ కాలనీలో 633 మంది లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Andhra Pradesh News | నెల్లూరు: నగరంలోని భగత్‌సింగ్ కాలనీలో శనివారం 633 మంది లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శాశ్వత ఇళ్లపట్టాలను అందజేసింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా హాజరుకాగా, జిల్లా మంత్రి పి. నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు పట్టాలు అందించారు.

హామీని నెరవేర్చామన్న మంత్రి నారాయణ

ఈ సందర్భంగా మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలన్న ఉద్దేశంతో నకిలీ ఇళ్లపట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో బాధితుల్ని కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారికి శాశ్వత పట్టాలు ఇస్తానని అప్పట్లో ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు తెలిపారు.

వర్చువల్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, వారి పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలు మస్తానమ్మ, సయ్యద్ సబీహా సీఎం తో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం రాఖీ పండుగ రోజున ఇళ్లపట్టాలు అందించడం తనకు ఆనందంగా ఉందన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు మాట్లాడుతూ, సూపర్ సిక్స్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

AP CM Chandrababu: 633 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ, హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

  • దేశంలో కూటమి ప్రభుత్వం మాత్రమే 64 లక్షల మందికి రూ.33 వేల కోట్ల పింఛన్లు అందిస్తుంది

  • అన్న క్యాంటీన్లు, రైతు భరోసా, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలు అమలులో ఉన్నాయి

  • త్వరలో ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభిస్తాం.

  • విద్యుత్ ఖర్చులు తగ్గించేందుకు సోలార్ పవర్‌ను సబ్సిడీతో అందుబాటులోకి తెచ్చాం

  • వ్యయాలను తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం

  • 2029 నాటికి పేదరికం లేని సమాజం ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం

  • ఇప్పటికే “P4” కార్యక్రమం కింద 15 లక్షల మంది దాతలు ముందుకు వచ్చారని’ చంద్రబాబు తెలిపారు.  

మళ్లీ జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలని ఉంది- చంద్రబాబు

లగిశపల్లి: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు దేవుడు సృష్టించిన అద్భుతమని, మరో జన్మ వస్తే ఇక్కడే పుట్టాలని ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా లగిశపల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "ఏజెన్సీలో స్వచ్ఛమైన వాతావరణం, అందమైన కొండలు మన కళ్లకు కనువిందు చేస్తాయి. ఇక్కడి ప్రజలు మంచి మనసుతో ఉండే వారు. ఆదివాసీలంటే సహజ నైపుణ్యం, సామర్థ్యం గుర్తొస్తుంది. గిరిజనుల అభివృద్ధి రాష్ట్రాభివృద్ధికి కీలకం. ఎన్టీఆర్ పాలనలోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసాం. ఇప్పుడూ ఆ దిశగా మేము నడుస్తున్నాం," అన్నారు.

"గిరిజన సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. ఐటీడీఏల్లో ఐఏఎస్‌లను నియమించి, ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. 7 ఐటీడీఏల్లో సమర్థవంతమైన పాలన కోసం అధికారులు కృషి చేస్తున్నారు. అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సాధించగలరు. పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. పాఠశాల భవనాల కోసం నిధులు విడుదల చేసాం. వైద్యసేవలను కూడా గిరిజన ప్రాంతాలకు తీసుకువచ్చాం. డోలీ మోతలు వినిపించని గ్రామాలుగా మారుతున్నాయి. నేను సీఎంగా ఉన్నప్పుడు చైతన్యం కార్యక్రమం ప్రారంభించాం. గిరిజనుల్లో చైతన్యం పెరిగితే అభివృద్ధిని అడ్డుకోవడం అసాధ్యం. మీ హక్కులను కాపాడుకుంటూ ముందుకెళితే, జీవితం మెరుగవుతుంది, వెలుగులు సాధ్యం. రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు పట్టాల పంపిణీ చేయడం సంతృప్తి ఇచ్చిందని " సీఎం చంద్రబాబు వివరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Embed widget